Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

మళ్ళీ కేసీఆర్ నోట థర్డ్ ఫ్రంట్ మాట …

మళ్ళీ కేసీఆర్ నోట థర్డ్ ఫ్రంట్ మాట …

చెన్నైలో తమిళనాడు సీఎం స్టాలిన్ తో కేసీఆర్ సమావేశం
తమిళనాడులో సీఎం కేసీఆర్ పర్యటన
కుటుంబ సమేతంగా పర్యటిస్తున్న కేసీఆర్
నేడు స్టాలిన్ నివాసానికి వెళ్లిన వైనం
యాదాద్రి ప్రారంభోత్సవానికి రావాలంటూ ఆహ్వానం

మళ్ళీ కేసీఆర్ నోట థర్డ్ ఫ్రంట్ మాట …గత కొన్ని రోజులుగా ఆయన కేంద్రంలోని బీజేపీ పై రగిలి పోతున్నారు. హుజురాబాద్ ఎన్నికల తరువాత ఆయన లో అసహనం పెరిగిందనే విమర్శలు వెల్లు ఎత్తుతున్నాయి. వరిధాన్యం కొనుగోళ్లు విషయంలో కేంద్రంపై కేసీఆర్ దాదాపు యుద్ధం ప్రకటించారు. పార్లమెంట్ సమావేశాలను సైతం టీఆర్ యస్ బహిష్కరించింది. బీజేపీ పై టీఆర్ యస్ ,టీఆర్ యస్ పై బీజేపీ విమర్శలు దాడి పెరిగింది. ఇప్పటివరకు కేంద్రంలోని బీజేపీ కి అన్ని విధాలుగా సహకరించిన టీఆర్ యస్ సడన్ గా యుద్ధం ప్రకటించంపై రకరకాల ఊహాగానాలు ఉన్నాయి. రాజకీయాల్లో అపార చాణిక్యుడుగా ఉన్న కేసీఆర్ ఎత్తుగడలపై అనేక సందేహాలు ఉన్నాయి. గతంలో ఒకసారి థర్డ్ ఫ్రంట్ ఆలోచనలను తెరపైకి తెచ్చిన కేసీఆర్ ఇప్పడు బీజేపీ ని ఓడించేవారితో చేతులు కలుపుతామని అంటున్నారు.అది ఎంతవరకు సాధ్యం . నిజంగానే కేసీఆర్ బీజేపీ కి వ్యతిరేకంగా నిలుస్తారా ?రాజీ చేసుకుంటారా ? అనే సందేహాలు కూడా లేకపోలేదు. తెలంగాణాలో బీజేపీ 2023 ఎన్నికల టార్గెట్ గా ఎత్తులు వేస్తుంది. దాన్ని తిప్పికొట్టేందుకు కేసీఆర్ బీజేపీ వ్యతిరేక శక్తులను కూడగట్టేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో నిలుస్తారా ?లేక జారుకుంటారా? అనే అనుమానాల నేపథ్యంలో తమిళనాడు సీఎం స్టాలిన్ ని కుటుంబసమేతంగా కలిశారు. ఈ సందర్భంగా బీజేపీ వ్యతిరేక శక్తులను కూడగట్టే విషయాలు కూడా చర్చకు వచ్చినట్లు తెలుస్తుంది.

తమిళనాడులో కుటుంబ సమేతంగా పర్యటిస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్ నిన్న శ్రీరంగంలో రంగనాథస్వామి ఆలయాన్ని సందర్శించారు. నేడు చెన్నైలో కేసీఆర్ తమిళనాడు సీఎం స్టాలిన్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ భేటీలో కేసీఆర్ అర్ధాంగి శోభ, తనయుడు కేటీఆర్, ఇతర కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి ప్రారంభోత్సవానికి రావాలంటూ స్టాలిన్ ను సీఎం కేసీఆర్ ఆహ్వానించారు. అంతేకాదు, థర్డ్ ఫ్రంట్ పైనా ఇరువురు చర్చించినట్టు తెలిసింది.

Related posts

మంత్రి పదవిని ఆశించడంలో తప్పులేదుగా!: తమ్మినేని సీతారాం!

Drukpadam

రైతు ఉద్యమానికి మద్దతుగా వరుస ట్వీట్లు.. ప్రముఖుల ట్విట్టర్ ఖాతాలను తొలగింపు!

Drukpadam

పొంగులేటికి రెండు పార్టీల ఆహ్వానం …ఇంకా నిర్ణయం తీసుకోలేదంటున్న పొంగులేటి…!

Drukpadam

Leave a Comment