ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ‌కు కాంగ్రెస్ మ‌ద్ద‌తు;వర్గీకరణ న్యాయసమ్మతమే: మ‌ధు యాష్కీ గౌడ్‌

ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ‌కు కాంగ్రెస్ మ‌ద్ద‌తు;వర్గీకరణ న్యాయసమ్మతమే
మాదిగ‌ల‌ను అభివృద్ధి వర్గీకరణ ద్వారానే సాధ్యం
మంద కృష్ణ సహాయం తీసుకోని అధికారంలోకి వచ్చిన కేసీఆర్
అనంతరం మంద కృష్ణను జైల్లో పెట్టారు.
మోడీ కూడా వర్గీకరణ అని మాట తప్పారు
వెంకయ్య నాయుడు చొరవతీసుకోవాలి
ప్రవేటీకరణ బడుగు బలహీన వర్గాలను తీరని నష్టం
టీపీసీసీ ప్ర‌చార క‌మిటీ ఛైర్మ‌న్ మ‌ధు యాష్కీ గౌడ్‌

న్యూఢిల్లీ, డిసెంబర్ 14 : ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ‌కు కాంగ్రెస్ పార్టీ మ‌ద్ద‌తు ఉంద‌ని తెలంగాణ కాంగ్రెస్ ప్ర‌చార క‌మిటీ ఛైర్మ‌న్ మ‌ధు యాష్కీ గౌడ్ ప్ర‌క‌టించారు. ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ‌తో మాదిగ‌ల‌తో పాటు స‌మాజానికి మేలు జ‌రుగుతుంద‌ని అన్నారు. ఢిల్లీలోని క‌ల్క‌టోరా ఇండోర్ స్టేడియంలో జ‌రిగిన స్టూడెంట్ మాదిగ పెడ‌రేష‌న్ స‌మావేశంలో ఆయ‌న పాల్గొని ప్ర‌సంగించారు. తెలంగాణ ఉద్య‌మ స‌మ‌యంలో మంద‌కృష్ణ మాదిగ స‌హాయాన్ని తీసుకుని.. అధికారంలోకి వ‌చ్చాక ఆయ‌న‌ను జైల్లో పెట్టిన చ‌రిత్ర కేసీఆర్ ద‌ని మ‌ధు యాష్కీ మండిప‌డ్డారు. ఎస్సీల్లో మాదిగ‌లు వెనుక‌బ‌డ్డార‌ని అన్నారు. స‌మైక్య రాష్ట్రంలో ఎస్సీల‌కు అన్యాయం జ‌రిగిందని.. ప్ర‌త్యేక రాష్ట్రంలో అయినా వారికి న్యాయం జ‌రుగుతుంద‌న్న ల‌క్ష్యంతోనే శ్రీమ‌తి సోనియాగాంధీగారు తెలంగాణ ఇచ్చార‌ని అన్నారు. అయితే కేసీఆర్ పాల‌న‌లో ద‌ళితుల‌కు న్యాయం జ‌ర‌గ‌డం లేద‌ని అన్నారు. ద‌ళితుల్లో మాదిగ‌లు కిందిస్థాయిలో ఉన్నారు.. వారిని కూడా స‌మాంతరంగా అభివృద్ధి చేయాల‌ని మ‌ధు యాష్కీ పిలుపునిచ్చారు.
ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ విషయంలో బీజేపీకూడా మాదిగ‌ల‌ను మోసం చేసింది. 2014 ఎన్నిక‌ల స‌మ‌యంలో బీజేపీ వారి మ‌ద్ద‌తు తీసుకుని.. అధికారంలోకి వ‌చ్చాక వారిని మోదీ మోసం చేశాడు. ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ విష‌యంలో ఉప రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య నాయుడు చొర‌వ తీసుకోవాలి. దేశ సంప‌ద‌లో ద‌ళితులు కూడా భాగ‌మే. అట్టుడుగు వ‌ర్గాల‌కు అందాల్సిన సంప‌ద‌ను కూడా మోదీ కార్పొరేట్లకు క‌ట్ట‌బెడుతున్నాడు. ఇప్పటికే ప్ర‌భుత్వ రంగ సంస్థ‌ల‌ను పెద్ద ఎత్తున అమ్మేశాడు. దీనితో పాటు విద్యాసంస్థ‌ల‌ను కూడా ప్రైవేటీక‌ర‌ణ చేసి.. ద‌ళితులకు, బ‌డుగు, బ‌ల‌హీన వ‌ర్గాల‌కు రిజ‌ర్వేష‌న్ల‌ను మోదీ దూరం చేస్తున్నాడు. త‌ద్వారా ద‌ళితులకు విద్య అంద‌కుండా చేస్తున్నాడని మ‌ధు యాష్కీ ఆరోపించారు. ద‌ళిత విద్యార్థుల‌కు ఫెలోషిప్స్, స్కాల‌ర్ షిప్స్ అందించాలని మధు యాష్కీ గౌడ్ డిమాండ్ చేశారు.

Leave a Reply

%d bloggers like this: