Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
వ్యవసాయం వార్తలు

ఫలించిన తుమ్మల కృషి…ఆనందంలో రైతులు!

ఫలించిన తుమ్మల కృషి…ఆనందంలో రైతులు
గ్రీన్ ఫీల్డ్ హైవే కు పరిహారం పెంపు
రైతు ఖాతాల్లో జమ …తుమ్మలను కలిసి కృతజ్ఞతలు తెలిపిన రైతులు

సూర్యాపేట నుండి దేవరపల్లి వరకు నిర్మిస్తున్న
గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారి నిర్మాణంలో విలువైన భూముల కోల్పోతున్న రైతులు ఇటీవల కాలంలో మాజీమంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వరరావుని కలిసి కోల్పోతున్న భూములకు సరైన నష్టపరిహారం కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం లేదు కావున
రైతులకు సరైన నష్టపరిహారం ఇప్పించేలా కృషి చేయవలసిందిగా తుమ్మలను కోరడం జరిగింది.
స్వతహాగా రైతు అయిన తుమ్మల వారి ఆవేదనను అర్థం చేసుకుని సెప్టెంబర్ మూడవ తారీఖున ఢిల్లీలో తెలంగాణ భవన్ భూమిపూజ కార్యక్రమంలో పాల్గొనుట కొరకు ఢిల్లీ వెళ్లారు ఈ క్రమంలోనే కేంద్ర జాతీయ రహదారుల శాఖ ముఖ్యకార్యదర్శి గిరిధర్ ఐఏఎస్ ని కలిసి రైతుల సమస్యలను విన్నవించి భూములు కోల్పోతున్న రైతులకు అత్యధిక నష్టపరిహారం ఇవ్వాలని కోరారు దానికి గిరిధర్ సానుకూలంగా స్పందించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి అనుమతి కూడా అవసరం వుంటుంది వారి నుండి ప్రతిపాదనలు పంపించినట్లైతే దానిని యధాతథంగా ఆమోదిస్థానని
హామీ ఇవ్వడం జరిగింది….
మళ్ళీ ఇదే విషయాన్ని తుమ్మల నాగేశ్వరరావు రాష్ట్ర చీఫ్ సెక్రెటరీకి సోమేశ్ కుమార్ కి
పోన్ చేసి రైతుల బాధలను సవివరంగా వివరించి సాధ్యమైనంత ఎక్కువ పరిహారం ఇప్పించాలి అని విజ్ఞప్తి చేయటం జరిగింది దానికి ఆయన స్పందించి ప్రతిపాదనలనాపై సంతకం చేసి కేంద్ర ప్రభుతానికి పంపించారు

నిన్న రైతుల ఖాతాలో నగదు జమ అయిన సందర్భంలో హర్షాతిరేకాలు వెలిబుచ్చుతున్నారు..రైతుల మోమున చిరునవ్వుకు కారణమైన తుమ్మల నాగేశ్వరరావు కి జీవితాంతం రుణపడి ఉంటామని తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు…
పదవులు వున్నా లేకపోయినా తుమ్మల నాగేశ్వరరావు ఎపుడూ ప్రజా సేవలో ముందుంటారని కొనియాడుతున్నారు…..

Related posts

మిర్చిపంట కు వైరస్ …నష్టపోయిన మిర్చి రైతులు!

Drukpadam

2000 టమాటా బాక్సులు అమ్మి రూ.38 లక్షలు సంపాదించిన కర్ణాటక రైతు…

Drukpadam

కాళేశ్వరంతో వ్యవసాయ రంగ ముఖచిత్రం మారిపోయింది: సీఎం కేసీఆర్…

Drukpadam

Leave a Comment