Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

కట్నం డబ్బులు , బంగారం తో వరుడు పరార్ …వధువు కుటుంబసభ్యుల పరేషాన్!

కట్నం డబ్బులు , బంగారం తో వరుడు పరార్ …వధువు కుటుంబసభ్యుల పరేషాన్!
మరో గంటలో పెళ్లి.. రూ. 25 లక్షలు, 25 తులాల బంగారంతో ఉడాయించిన వరుడు!
సంగారెడ్డి జిల్లాలో ఘటన ఈ నెల 12న వివాహానికి ఏర్పాట్లు
వరుడితోపాటు కుటుంబ సభ్యులు కూడా ఊరు విడిచి వెళ్లిన వైనం
ఆగిపోయిన పెళ్లి…న్యాయం కావాలంటున్న వధువు కుటుంబం
జిల్లా న్యాయసేవాధికార సంస్థలో వధువు ఫిర్యాదు

మరో గంటలో పెళ్లి అందుకు వధువు తరుపు వాళ్ళు అంతా పెళ్లికోసం వచ్చారు. అంతా ఆనందంలో ఉండగా పిడుగులాంటి వార్త పెళ్ళికొడుకు కట్నం డబ్బు , బంగారంతో సహా పారిపోయాడని దీంతో చేసేది లేక వధువు కుటుంబ సభ్యులు న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించే పరిస్థితి . జిల్లా న్యాయసేవాధికార సంస్థలో ఫిర్యాదు చేశారు.

అందరు పెళ్లి ఏర్పాట్లలో ఉండగా మరి కాసేపట్ల పెళ్లి మండపానికి రావాల్సిన పెళ్లి కొడుకు చోర్ అవతారం ఎత్తారు . ఎంచక్కా వధువు కుటంబం ఇచ్చిన కట్నం డబ్బులు, బంగారం పట్టుకుని ఉడాయించాడో ప్రబుద్దుడు . సంగారెడ్డి జిల్లా కంది మండలం చిమ్నాపూర్ గ్రామంలో జరిగిందీ ఘటన. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన యువతిని కొండాపూర్ మండలం మల్కాపూర్‌కు చెందిన మాణిక్‌రెడ్డికి ఇచ్చి వివాహం జరిపించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఆగస్టులో నిశ్చితార్థం కూడా నిర్వహించారు. ఈ సందర్భంగా వరుడికి రూ. 25 లక్షల నగదు, 25 తులాల బంగారాన్ని కట్నంగా ఇచ్చారు.

ఈ నెల 12న వీరి వివాహం జరగాల్సి ఉండగా, సంగారెడ్డిలోని పోతిరెడ్డి‌పల్లిలో కల్యాణ మండపం ఏర్పాటు చేశారు. సరిగ్గా మరో గంటలో వివాహం జరుగుతుందనగా కట్నంగా ఇచ్చిన రూ. 25 లక్షల నగదు, 25 తులాల బంగారం పట్టుకుని వరుడు ఊరి నుంచి పరారయ్యాడు. ఆ తర్వాత కుటుంబ సభ్యులు కూడా ఊరు విడిచారు. దీంతో పెళ్లి ఆగిపోయింది. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కాగా, బాధిత వధువు నిన్న జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యాలయంలోనూ వరుడు, అతడి కుటుంబ సభ్యులపై ఫిర్యాదు చేసింది.

Related posts

వచ్చే వారం అధికారుల ముందు లొంగిపోనున్న ట్రంప్..?

Drukpadam

మహిళల భద్రతకు రక్షణ కవచంగా షీ టీమ్స్ … పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్!

Drukpadam

అమెరికాలో ఉంటూనే ఇండియాలో ఉన్న భార్య హత్యకు కుట్ర.. అయినా దొరికిపోయిన వైనం!

Drukpadam

Leave a Comment