Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

రాహుల్ ప్రధాని అవుతారు : ప్రశాంత్ కిషోర్ మాట మార్చారు.

రాహుల్ ప్రధాని అవుతారు : ప్రశాంత్ కిషోర్ మాట మార్చారు.
రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ అనుకూలంగా మాట్లాడారు
కొద్దిరోజుల క్రితం బీజేపీకి ప్రత్యాన్మాయం లేదని చెప్పారు
కాంగ్రెస్ లేకుండా ప్రతిపక్షాలు కేంద్రంలో అధికారం చేపట్టడం కష్టం అంటున్నారు
ప్రశాంత కిషోర్ మాటల మార్పుపై మర్మంమేమిటి ?

కాంగ్రెస్ తో ఏమీకాదు …అది బీజేపీ కి ప్రత్యాన్మాయం కాదన్నా ప్రశాంత్ కిషోర్ ఒక్కసారిగా మతమార్చడంపై రాజకీయవర్గాలలో ఆశక్తికర చర్చ జరుగుతుంది.అప్పుడు ఆలా ఇప్పుడు ఇలా ప్రశాంత కిషోర్ మాట్లాడటంలో మర్మం ఏమిటనే చర్చ జరుగుతుంది. దేశంలోనే ఎన్నికల వ్యూకర్తగా మంచి పేరున్న ప్రశాంత్ కిషోర్ మాటలకూ విలువ ఉంటుంది. ఇప్పటివరకు ఆయన చెప్పిన ఎన్నికల సర్వేలు దాదాపు సెక్సెస్ అయ్యాయి. అనేక రాష్ట్రాలలో ఆయన ఆధ్వరంలో టీం లు పనిచేసి ఫలితాలు సాధించాయి. ప్రశాంత్ కిషోర్ పని చేస్తున్నాడనేతేనే ప్రత్యర్థులకు దడ పుట్టడమే . కాంగ్రెస్ ను వ్యతిరేకించిన ఆయన రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని చెప్పడంపై రాజకీయవర్గాలు ఆలోచనలో పడ్డాయి.

మొన్నటివరకు కాంగ్రెస్ తో ఏమి కాదని మాట్లాడిన కిషోర్.. ఇప్పుడు కాంగ్రెస్ లేకుండా ప్రతిపక్ష పార్టీలు కేంద్రంలో అధికారం చేపట్టడం కష్టమనే విధంగా మాట్లాడారు. తాజాగా ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రశాంత్ మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ ప్రధాని అయ్యే ఛాన్స్ ఉందని వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీపై కీలక వ్యాఖ్యలు చేశారు.

కాంగ్రెస్ లేకుండా విపక్షాలు కూటమి కట్టి అధికారం చేపట్టడం కష్టమే అని చెప్పారు. అయితే గత వారం కాంగ్రెస్ కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు కిషోర్. కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందని.. ఆ పార్టీ లేకుండానే బీజేపీకి ప్రత్యామ్నాయంగా కూటమి ఏర్పాటవుతుందని తెలిపారు. ఈ వ్యాఖ్యలు చేసిన కొద్దీ రోజులకే.. తిరిగి కాంగ్రెస్ బలమైన పార్టీ అంటూ వ్యాఖ్యానించారు. రెండు ఇంటర్వ్యూలలో ప్రశాంత్ భిన్నస్వరాలు వినిపించారు.

ఇక బీహార్ సీఎం నితీష్ తో మాట్లాడుతారా? అంటూ ఇంటర్వ్యూవర్ అడగ్గా.. తాము మాట్లాడుతూనే ఉంటామని తెలిపారు. తాను చాలామందితో కలిసి పనిచేశానని అయితే వీరిలో పంజాబ్ మాజీ సీఎం అమరీందర్ సింగ్‌తో మాత్రం పని చేయడం ఏమాత్రం నచ్చదని నిర్మొహమాటంగా తేల్చి చెప్పారు. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతూ.. గాంధీ పరివారం లేకపోయిన ఆ పార్టీ మనుగడ సాగించగలదని తేల్చిచెప్పారు

Related posts

బీజేపీలోకి ఈటల.. త్వరలోనే బీజేపీ చీఫ్ నడ్డాతో భేటీ!

Drukpadam

ఇక‌ సమయం ఆసన్నమయింది’ అంటూ ప‌వ‌న్ క‌ల్యాణ్ కీల‌క వ్యాఖ్య‌!

Drukpadam

ఖమ్మంలో ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఉద్రిక్త …పువ్వాడ వర్సెస్ పొంగులేటి…

Drukpadam

Leave a Comment