తన కుమార్తె షీనా బోరా జీవించే ఉందంటూ సీబీఐకి ఇంద్రాణి లేఖ‌!

తన కుమార్తె షీనా బోరా జీవించే ఉందంటూ సీబీఐకి ఇంద్రాణి లేఖ‌!

  • 2012లో మృతి చెందిన షీనా బోరా బతికే ఉందంటున్న తల్లి 
    ఈ కేసులో తల్లి ఇంద్రాణికి హత్యలో ప్రమేయం ఉందని శిక్ష
  • ఇటీవ‌ల క‌శ్మీర్‌లో ఒక‌రికి క‌న‌ప‌డింద‌ని ఇంద్రాణి లేఖ‌
  • ఆమెను వెతకాలంటూ లేఖ రాసిన వైనం
  • కోర్టులోనూ విచార‌ణ‌కు వ‌చ్చే అవ‌కాశం

షీనా బోరా మృతి కేసులో ఆమె త‌ల్లి ఇంద్రాణి ముఖర్జియా మ‌రో ట్విస్ట్ ఇచ్చింది. త‌న కుమార్తె జీవించే ఉందంటూ సీబీఐ డైరెక్టర్‌కు ఆమె లేఖ రాయ‌డం గ‌మ‌నార్హం. 2012లో షీనా బోరాను హత్య చేసిన కేసులో ఇంద్రాణి నిందితురాలిగా ఉన్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఇంద్రాణి తాజాగా సీబీఐకి ఓ లేఖ రాసి.. కశ్మీర్‌లో షీనా బోరాను కలిశానంటూ ఇటీవల జైలులో ఉన్న ఓ మహిళ తనకు చెప్పిందని ఆమె పేర్కొంది.

కశ్మీర్‌లో షీనా బోరా కోసం వెతకాలని ఆమె అధికారుల‌కు విజ్ఞ‌ప్తి చేసింది. ఆమె ప్రత్యేక సీబీఐ కోర్టుకు ఒక దరఖాస్తు కూడా పంపించ‌డం గ‌మ‌నార్హం. ఈ అంశం కోర్టులో త్వరలో విచారణకు రానుంది. కాగా,  షీనా బోరా హత్య కేసులో ఇంద్రాణి ఆరేళ్లుగా ముంబైలోని బైకుల్లా జైలులో రిమాండులో ఉంటోన్న విష‌యం తెలిసిందే. ఆమె బెయిల్ దరఖాస్తు చేసుకోగా బాంబే హైకోర్టు గత నెలలో దాన్ని తిరస్కరించింది. త్వరలో ఆమె సుప్రీంకోర్టుకు వెళ్ల‌నుంది.

గ‌తంలో ఇంద్రాణి డ్రైవర్ శ్యాంవర్ రాయ్ తుపాకీతో దొరికిన నేప‌థ్యంలో షీనా బోరా హత్య కేసు వెలుగులోకి రావడంతో విచార‌ణ జ‌రుగుతోంది. పోలీసులు విచార‌ణ జ‌ర‌ప‌డంతో ఈ హ‌త్య కేసులో ఇంద్రాణి ప్ర‌మేయం ఉన్న‌ట్లు బ‌య‌ట‌ప‌డింది. ఇంద్రాణికి షీనా బోరా మొదటి కుమార్తె అని పోలీసులు గుర్తించారు. ముంబైలో ఇల్లు ఇప్పించాలని షీనా తల్లిని బ్లాక్ మెయిల్ చేసింద‌ని అప్ప‌ట్లో తేల్చారు. దీంతో ఆమెపై విచార‌ణ కొన‌సాగుతోంది.

Leave a Reply

%d bloggers like this: