Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఖమ్మం టీఆర్ యస్ లో సరిగమలు…

ఖమ్మం టీఆర్ యస్ లో సరిగమలు…
ఆఇద్దరు నేతలను పంపిస్తారా ? లేక వెళ్లి పోతారా ?
మరో నేత పై కూడా రహస్య నివేదిక
ఇటీవల జరిగిన స్థానికసంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్
క్రాస్ ఓటింగ్ కు వారే భాద్యులనే అనుమానాలు
ఖమ్మం పరిణామాలపై కేసీఆర్ నజర్

ఖమ్మం జిల్లా రాజకీయాలు మారనున్నాయా? అంటే కచ్చితంగా మారటం ఖాయం అంటున్నారు రాజకీయపరిశీలకులు …అధికార టీఆర్ యస్ పార్టీ లో అగ్గిరాజుకునే ఛాన్స్ కనిపిస్తుంది. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార టీఆర్ యస్ పార్టీ నుంచి భారీ క్రాస్ ఓటింగ్ జరిగింది. దీనిపై జిల్లా ప్రజాప్రతినిధులతో పాటు అధినేత కేసీఆర్ సీరియస్ గా ఉన్నారనే టాక్ వినిపిస్తుంది. అయితే ఇందుకు భాద్యులు ఎవరు అనేదానిపై కేసీఆర్ ఆరా తీస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఇది మాజీలపనేనా లేక ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలో అన్వేషణ జరుగుతుంది . అందరిచూపు వెంటనే ముగ్గురివైపు మళ్లుతుంది. ముగ్గురు మాజీ ప్రజాప్రతినిధులే కావడం వారికీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో నిత్యసంబందాలు ఉండటం మరిన్ని అనుమానాలకు తావిస్తుంది.

జిల్లా నుంచి ఎమ్మెల్సీ టికెట్ ఆశించిన ముఖ్యనేతలకు టికెట్ ఇవ్వకుండా రాజకీయాల్లో జూనియర్ గా ఉన్న తాతా మధుకు ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వడంపై జిల్లాలోని చాలామంది నాయకులూ కేసీఆర్ నిర్ణయంపై గుర్రుగా ఉన్నారు. దీంతో మధు విజయంపై సందేహాలు ఉన్న పకడ్బందీ వ్యూహంతో గట్టెక్కారు . సుమారు 150 ఓట్ల వరకు క్రాస్ జరిగింది. ఈ పాపం ఎవరిదీ ?దీనికి భాద్యులు ఎవరు ? అనేది నిర్దారణ కావాల్సి ఉంది. కానీ అనుమానం మాత్రం మాజీలమీదే ఉంది. నిజంగా వారు క్రాస్ చేయించారా? లేక వారిని పంపించేందు సిద్దమై    పొమ్మనలేక పొగపెడుతున్నారనే అభిప్రాయాలు ఉన్నాయి. వారిపై క్రాస్ ఓటింగ్ నెపంతో బయటకు పంపిస్తారా ? లేక వారే వెళ్లి పోయేట్లు   చేస్తారా ? అనేది ఆశక్తిగా మారింది.

మాజీలు సీఎం కేసీఆర్ తమను అవమానిస్తున్నారని తమ మంచితనాన్ని చేతగాని తనంగా భావిస్తున్నారని దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉండి చక్రం తిప్పిన తమకు కనీస గౌరవం ఇవ్వడంలేదని అభిప్రాయాలు ఉన్నాయి. ప్రధానంగా తమకు టికెట్ ఇవ్వకపోయినా ఫర్వాలేదు కనీసం తమను విశ్వాసంలోకి తీసుకోకపోవడంపై వారు చాల మనోవేదనకు గురౌతున్నారు. పైగా టికెట్ ఇచ్చిన తరువాత అయినా తమను సహకరించమని అడగక పోవడంపై హార్ట్ అయ్యారు. ఇన్ని అవమానాలు భరిస్తూ పార్టీలో ఉండటం పై వారు మల్లగుల్లాలు పడుతున్నారు . వారి అనుయాయిలు ఇది తమ నాయకులకు జరిగిన అవమానంగా ఫీలౌతున్నారు. ఇక మీదట టీఆర్ యస్ లో ఉండటమా? లేదా అనే ఆలోచనలో ఉన్నారు.

ఈ అవమానాలు భరించడం మావల్ల కాదు .అందువల్ల ఎదో ఒక నిర్ణయం తీసుకోండి మీవెంటే మేము అంటూ అనుయాయులు మాజీలపై ఎం పెద్ద ఎత్తున వత్తిడి తెస్తున్నారు. టీఆర్ యస్ అధిష్టానం సైతం వారిని వదిలించుకోవడం పై ద్రుష్టి సారించినట్లు గుసగుసలు బయలు దేరాయి . అయితే జనంలో పట్టున్న వారిని జనం నుంచి ఒంటరి చేయటం ఎలాగా అనేది ఇప్పుడు ప్రధాన సమస్యగా ఉంది. మాజీ నేతలకు ప్రజలతో మంచి సంబంధాలు ఉన్నాయి. అందువల్ల వారు వెళ్ళిపోయినా లేదా పంపించినా జిల్లాలో పార్టీకి జరిగే డేమేజ్ పై కూడా రహస్య నివేదికలు తెప్పించుకుంటున్నారనే ప్రచారం జరుగుతుంది. అందులో ముగ్గురు నేతల్లో ఒకరిపై ముందు వేటు వేసి మిగతావారిని బుజ్జగించాలనే ఆలోచనలు చేస్తారనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి.

సీనియర్లుగా ఉన్న తమ సహకారం తీసుకోనందున సహజంగానే వారు ఎమ్మెల్సీ ఎన్నికకు దూరంగా ఉన్నారు. అందువల్ల ఆ మాజీ ప్రజాప్రతినిదులు క్రాస్ ఓటింగ్ చేయించారనే అభిప్రాయాలు బలంగా ఉన్నాయి. క్రాస్ ఓటింగ్ ఎక్కడ జరిగింది ఎవరి ద్వారా జరిగింది నిజంగా మాజీలు క్రాస్ ఓటింగ్ చేయించారా? స్థానిక సంస్థల ప్రతినిధులే అసంతృప్తితో వ్యతిరేకంగా ఓట్లు వేశారా అనే దానిపై ఆరా తీస్తున్నారు .

టీఆర్ యస్ రెండవసారి అధికారంలోకి వచ్చి మూడు సంత్సరాలు అయింది. నాయకత్వంపై ప్రజల్లో ఆశలు సన్నగిల్లు తున్నాయి. ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయడంలేదని విమర్శలు ఉన్నాయి. ఈ సమయంలో నేతలపై వేటు వేసే సాహసం చేస్తారా ?లేదా అనేది చూడాలి మరి !

Related posts

గుజరాత్ లో ఆప్ కు ఎదురుదెబ్బ.. బీజేపీలో చేరిన సూరత్ కౌన్సిలర్లు!

Drukpadam

కేజ్రీవాల్ పై మండిపడ్డ హర్యానా సీఎం ఖట్టర్…

Drukpadam

తాగండి తాగి! తాగి ఊగండి !! ఇది కేసీఆర్ ప్రభుత్వం తీరు ;సీఎల్పీ నేత భట్టి ధ్వజం!

Drukpadam

Leave a Comment