దేశవ్యాపితంగా కాంగ్రెస్ కవాత్…తెలంగాణాలో రేవంత్ ,భట్టి పాదయాత్రలు!

దేశవ్యాపితంగా కాంగ్రెస్ కవాత్…తెలంగాణాలో రేవంత్ ,భట్టి పాదయాత్రలు!
-అమేథీలో రాహుల్ , ప్రియాంక కావత్ కు సంఘీభావం
-పాల్గొన్న కాంగ్రెస్ శ్రేణులు
-జనవరి 30 నుంచి 15 రోజులు కాంగ్రెస్ పాదయాత్ర
-రాష్ట్రానికి రానున్న రాహుల్ …బహిరంగ సభ

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పోరుబాట పట్టింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా జనంలోకి వెళ్లాలని నిర్ణయించింది. దేశంలో రోజురోజుకూ పెరిగిన నిత్యావసర ధరల పెరుగుదల, సామాన్యులకు అందుబాటులోలేకుండా డీజిల్ ,పెట్రోల్ ,గ్యాస్ భారాలకు కు వ్యతిరేకంగా భూ సంస్కరణలే ప్రధాన అస్త్రాలుగా చేసుకుని ప్రజల్లోకి వెళ్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ తప్పిదాలను ఎండగట్టేలా పాదయాత్రకు సిద్దమైంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ,ప్రియాంక గాంధీ శనివారం అమేథీ లో పాదయాత్ర చేపట్టగా ,వారికీ సంఘీభావంగా దేశవ్యాపితంగా కాంగ్రెస్ శ్రేణులు పాదయాత్రలు చేపట్టాయి., ఇవాళ చేవళ్ల నుంచి రేవంత్ రెడ్డి పాదయాత్ర చేపట్టగా ,సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఖమ్మంలో పాదయాత్ర చేపట్టారు. ఈ పాదయాత్రకు సీడబ్యూసీ సభ్యుడు దిగ్విజయ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరైయ్యారు.

కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలు, నిత్యావసర ధరల పెరుగుదల , భూసంస్కరణలపై పోరుకు కాంగ్రెస్ అధిష్టానం పిలుపు ఇచ్చింది. దీంతో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు పాదయాత్రలకు దిగారు. ఉత్తరప్రదేశ్ లోని అమేథీలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు సైతం పాదయాత్రకు పూనుకున్నారు. ఈ నేపథ్యంలో వారికి సంఘీభావంగా తెలంగాణ కాంగ్రెస్ నేతలు కూడా ఆందోళనలకు దిగుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులు పాదయాత్ర చేపట్టారు.

తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేవెళ్ల నుంచి ప్రారంభించిన పాదయాత్రకు సీడబ్యూసీ సభ్యుడు దిగ్విజయ్ సింగ్ ముఖ్యఅతిథిగా హాజరైయ్యారు . చేవెళ్ల మండలం ముడిమ్యాల చౌరస్తా కూడలిలోని డా.బీ.ఆర్ అంబేడ్కర్ విగ్రహం నుంచి పాద‌యాత్ర ప్రారంభమైంది .

చేవెళ్లలోకి ఇంధిరాగాంధీ విగ్రహం వరకు వరకు పాదయాత్ర కొనసాగింది . సుమారు 10 కి.మీ మేర సాగిన ఈ పాదయాత్రలో పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు . అనంతరం బహిరంగ సభ నిర్వహించారు . మరోవైపు ఖమ్మంలో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, సంగారెడ్డిలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి పాదయాత్ర చేపట్టారు .

కేంద్రం ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మీనాక్షి నటరాజన్ తెలంగాణలో పాద‌యాత్ర చేయ‌నున్నారు. జనవరి 30వ తేది నుంచి 15 రోజుల పాటు పాదయాత్ర సాగ‌నుంది. ఇందులో పాల్గొనేందుకు రాహుల్ గాంధీ 2022 ఫిబ్రవరి మొదటి వారంలో తెలంగాణకి రానున్నారు. ఒక్కరోజు పాదయాత్రలో పాల్గొంటారు. రాహుల్ వస్తున్న నేపథ్యంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నారు .

Leave a Reply

%d bloggers like this: