మహిళ అండర్‌వేర్‌ను మాస్కుగా ధరించిన ప్రయాణికుడు, తీసేందుకు నిరాకరణ.. విమానం నుంచి దించివేత!

మహిళ అండర్‌వేర్‌ను మాస్కుగా ధరించిన ప్రయాణికుడు, తీసేందుకు నిరాకరణ.. విమానం నుంచి దించివేత!

  • అమెరికాలోని ఫ్లోరిడాలో ఘటన
  • విమాన సిబ్బంది చెప్పినా అండర్‌వేర్ తీసేందుకు నిరాకరణ
  • అతడిపై నిషేధం విధించిన విమానయాన సంస్థ
  • సిబ్బంది తీరుకు నిరసనగానేనన్న ప్రయాణికుడు

మహిళ అండర్‌వేర్‌ను మాస్కులా ధరించి విమానమెక్కిన ప్రయాణికుడిని విమాన సిబ్బంది కిందికి దించేశారు. అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగిందీ ఘటన. ఇక్కడ ఫోర్ట్ లౌడెర్‌‌డేల్ విమానాశ్రయం నుంచి విమానం బయలుదేరేందుకు సిద్ధంగా ఉంది. బోర్డింగ్ పాస్, కరోనా లేనట్టుగా ధ్రువీకరణ పత్రం చూసి ప్రయాణికులను విమానంలోకి అనుమతించారు.

విమానం టేకాఫ్‌కు సిద్ధమవుతున్న సమయంలో ఆడమ్ జేన్ (38) అనే వ్యక్తి మహిళ అండర్‌వేర్‌ను మాస్కుగా ధరించడాన్ని చూసి విమాన సిబ్బంది ఆశ్చర్యపోయారు. దానిని తొలగించి సాధారణ మాస్కు ధరించాలని కోరారు. అందుకు అతడు నిరాకరించారు. ఎంతగా చెప్పినా అతడు మాట వినకపోవడంతో విమానం నుంచి దించేశారు.

అంతేకాదు, మాస్కు నిబంధనలు ఉల్లంఘించినందుకు గాను అతడిపై నిషేధం విధిస్తున్నట్టు విమానయాన సంస్థ పేర్కొంది. దీనిపై ఆడమ్ జేన్ మాట్లాడుతూ.. విమానంలో తినేటప్పుడు, తాగేటప్పుడు కూడా మాస్కు ధరించాలని చెబుతున్నారని, అందుకు నిరసనగానే తాను ఈ పని చేసినట్టు చెప్పాడు. అంతేకాదు, గతంలోనూ తాను ఇలానే ప్రయాణించానని, అప్పట్లో విమాన సిబ్బంది తనను అడ్డుకోలేదని గుర్తు చేశాడు. కాగా, ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేస్తోంది.

Leave a Reply

%d bloggers like this: