Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ప్రజల నుంచి విమర్శలు …మద్యం ధరలు తగ్గించిన ఏపీ సర్కార్

ప్రజల నుంచి విమర్శలు …మద్యం ధరలు తగ్గించిన ఏపీ సర్కార్
-మద్యం ధరలు తగ్గించిన ఏపీ ప్రభుత్వం… వచ్చేవారం నుంచి ప్రముఖ బ్రాండ్ల మద్యం విక్రయాలు
-మద్యం విధానంలో కీలక మార్పులు చేసిన సర్కారు
-మద్యం పన్ను రేట్లలో మరోసారి మార్పులు
-ఆదేశాలు జారీ చేసిన రెవెన్యూ శాఖ
-ఇండియన్ మేడ్ ఫారెన్ లిక్కర్ ధరలు 12 శాతం తగ్గే చాన్స్
-ఇతర కేటగిరీల్లో 20 శాతం వరకు ధర తగ్గే అవకాశం

ఏపీ ప్రభుత్వం మద్యం విధానానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజల నుంచి చాలాకాలంగా విమర్శలు వస్తున్న నేపథ్యంలో మద్యం పన్ను రేట్లలో మరోసారి మార్పులు చేసింది. పక్క రాష్ట్రాల నుంచి రకరకాల మార్గాలలో మద్యం వేరులైపారుతున్నది . ఎంత నిఘా ఉంచినప్పటికీ దాన్ని కంట్రోల్ చేయలేకపోతోంది. అక్రమార్కులు వివిధ మార్గాలలో తెలంగాణ నుంచి మద్యం తీసుకోని వస్తున్నారు. దీంతో ప్రభుత్వం పునరాలోచలనో పడింది. వ్యాట్, ఎక్సైజ్ పన్ను, ప్రత్యేక మార్జిన్ ల అంశంలో హేతుబద్ధత తీసుకువచ్చింది. పన్నుల హేతుబద్ధత ద్వారా మద్యం ధరలు తగ్గుతాయని ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ ఆదేశాలు జారీ చేశారు.

ప్రభుత్వ తాజా ఉత్తర్వులతో ఇండియన్ మేడ్ ఫారెన్ లిక్కర్ బ్రాండ్లపై 5 నుంచి 12 శాతం ధరలు తగ్గే అవకాశముంది. ఇతర అన్ని కేటగిరీలపై 20 శాతం వరకు ధరలు తగ్గుతాయని రజత్ భార్గవ పేర్కొన్నారు. అక్రమ మద్యం, నాటుసారా తయారీ అరికట్టేందుకే ధరల తగ్గింపు చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. వచ్చేవారం నుంచి రాష్ట్రంలో ప్రముఖ సంస్థల బ్రాండ్ల మద్యం అమ్మకాలు జరుగుతాయని తెలిపారు. ప్రభుత్వ చర్యల వల్ల రాష్ట్రంలో 37 శాతం మద్యం వినియోగం తగ్గిందని, అయితే అక్రమ రవాణా నిరోధించడానికే మద్యం ధరలు తగ్గిస్తున్నామని రజత్ భార్గవ వివరించారు.

Related posts

న్యాయం గెలిచింది… న్యాయమే గెలుస్తుంది: చంద్రబాబు

Drukpadam

బీజేపీ మళ్లీ సానుభూతి డ్రామాలు ఆడుతుందన్న బాల్క సుమన్.. ఆ అవసరం లేదన్న ఈటల!

Drukpadam

క్యాసినో నిర్వహించలేదు.. గతంలో మాదిరే శిబిరాలు మాత్రం కొనసాగాయి: గుడివాడ ఘటనపై వల్లభనేని వంశీ!

Drukpadam

Leave a Comment