Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

బిగ్ బాస్ సీజన్ 5 విజేత ఖమ్మం కుర్రాడు వి జే సన్నీ !

బిగ్ బాస్ సీజన్ 5 విజేత ఖమ్మం కుర్రాడు వి జే సన్నీ !
టైటిల్ నెగ్గిన సన్నీ
రన్నరప్ గా షణ్ముఖ్
సన్నీకి రూ.50 లక్షల నగదు, ప్లాట్, బైకు

బిగ్ బాస్ సీజన్ 5 విజేతగా ఖమ్మంకు చెందిన వి.జే సన్నీ నిలిచారు. హజ్ లో అన్ని పరీక్షల్లో తనదైన శైలిలో ప్రజల మన్ననలు పొంది అత్యధిక ఓట్లు పొందటం ద్వారా విజేతగా నిలిచారు. విజేతకు 50 లక్షలతో పాటు సువర్ణ కుటీర్ వారు షాద్ నగర్ లో 300 గజాల ప్లాట్ లభించింది. ఒక బైక్ కూడా ప్రజెంట్ చేశారు . రన్నర్ గా షణ్మక్ నిలిచారు. హోస్ట్ నాగార్జున విజ్ఞప్తి మేరకు షణ్ముఖ్ కు కూడా చిన్న ప్లాట్ ఇచ్చేందుకు సువర్ణ కుటీర్ వారు అంగీకరించారు. ఆదివారం సాయంత్రం 6 గంటల వరకు నుంచి స్టార్ మా లో ప్రసారం అయినా సీజన్ 5 గ్రాండ్ ఫైనలికి అతిరధ మహారధులు గెస్ట్ లుగా వచ్చారు. ప్రేక్షకులను అలరించారు.

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5 అత్యంత వైభవంగా ముగిసింది. నరాలు తెగే ఉత్కఠత మధ్య నాగార్జున విజేత ను ప్రకటించారు .దీంతో 15 వారాలుగా అత్యంత విజయవంతంగా నడిచిన అతిపెద్ద రియాలిటీ షోకు తెరపడినట్లు అయింది. అంతకు ముందు టాప్ ఫైవ్ లో ఉన్న వారిలో ఒక్కరిని ఎలిమినేట్ చేసుకుంటూ వచ్చారు. ఓట్లు వచ్చినదని ప్రకారం ముందుగా సిరి ఎలిమినేట్ కాగా తరువాత మానస్ , ఆ తరవాత శ్రీరామచంద్ర ఎలిమినేట్ అయ్యారు. బయట అందరు ఊహించినట్లు గానే చివరకు సన్నీ ,షణ్ముకు మిగిలారు . చివరలో అత్యధిక ఓట్లు వచ్చిన సన్నీని విజేతగా ప్రకటించారు. కాగా, విజేతగా తన పేరు ప్రకటించగానే సన్నీ ఆనందం అంతాఇంతా కాదు. హోస్ట్ నాగార్జునను పైకెత్తి తన సంతోషాన్ని వెలిబుచ్చాడు. వేదికపై గెంతుతూ కేరింతలు కొట్టాడు. సన్నీ ప్రస్థానం ఆసక్తికరం అని చెప్పాలి. మొదట పాత్రికేయుడిగా పనిచేసిన సన్నీ ఆ తర్వాత టెలివిజన్ రంగంలో ప్రవేశించి వీజేగా అలరించాడు. అటు తర్వాత సీరియల్ నటుడిగా తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గరయ్యాడు.

ఖమ్మంలో అతి సామాన్యమైన కుటుంబంలో జన్మించిన సన్నీ బుల్లి తెరద్వారా ఎంటరై టైనర్ గా అందరిని అలరించి బిగ్ బాస్ హౌస్ లోకి ప్రవేశించారు. అందులో అనేక ఆటుపోట్లను తట్టుకుని నిలబడ్డారు . తాను ఇంతటి వాడిని కావడంలో తనతల్లి కళావతి ప్రోత్సాహం ఏంతో ఉందని సన్నీ కొనియాడారు . తనకు వచ్చిన ట్రోఫీ ని తన తల్లికి అందించి ఆనందంపొందారు .

ఖమ్మంలో సంబరాలు

బిగ్ సీజన్ 5 లో విజేతగా ఖమ్మం కు చెందిన సన్నీ నిలవడం సన్నీ అభిమానులు ఖమ్మంలో సంబరాలు జరుపుకున్నారు.

Related posts


వేషం మార్చినంత మాత్రాన ఈటల ఉత్తముడు కాలేడు: రేవంత్ రెడ్డి

Drukpadam

తెలంగాణలోని చారిత్రక రామప్ప గుడికి యునెస్కో గుర్తింపు!

Drukpadam

2023లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు గడ్డు కాలమే.. ఐఎంఎఫ్ ఆందోళన!

Drukpadam

Leave a Comment