పరిటాల శ్రీరామ్ కూల్ స్పందన …

-ఆయన పార్టీ టికెట్ సంపాదించుకుంటే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా: పరిటాల శ్రీరామ్ సవాల్
-ఓ మాజీ ఎమ్మెల్యేను ఉద్దేశించి వ్యాఖ్యలు
-అలాంటి వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్న శ్రీరామ్
-పార్టీ బలోపేతంపై దృష్టిసారించాలని పార్టీ శ్రేణులకు సూచన

రాజకీయాలలో సవాళ్ల పర్వం కొత్త కానప్పటికీ కొందరి చేసే సవాళ్లు విచిత్రంగా ఉంటాయి. మరికొందరు సొంతపార్టీ వల్లపనే సవాళ్లు చేస్తుంటారు …అలాంటిదే అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీలో చోటు చేసుకుంది . ధర్మవరం టీడీపీ ఇంచార్జి పరిటాల శ్రీరామ్ పై అలాటి సవాళ్ళే వచ్చాయి. 2024 ఎన్నికల్లో తిరిగి ధర్మవరం నుంచి పోటీచేయాలని శ్రీరామ్ యోచిస్తున్నారు .అందుకు అనుగుణంగా కార్యక్రమాలు చేస్తున్నారు. అయితే ధర్మవరానికి చెందిని మరో టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ ఎన్ని చేసిన వచ్చే ఎన్నికల్లో ఆయన్ను టికెట్ తెచుకోమనండి చూద్దాం అని సవాల్ విసిరారు . అంతే కాదు శ్రీరామ్ టికెట్ తెచ్చుకుంటే తాను రాజకీయాలనుంచి తప్పుకుంటానని కూడా పార్టీలోని ప్రత్యర్థి అనడం విశేషం   అయితే దానికి శ్రీరామ్ కూడా స్పందించారు. సొంతపార్టీ మనిషిపై తీవ్ర విమర్శలు ఎందుకనుకున్నారో ఏమో కానీ కూల్ గా స్పందించారు. దీంతో తెలుగు దేశంలోని శ్రీరామ్ అనుయాయులు అన్న ఇంట కూల్ గా స్పందిస్తే ఎలా అన్నా వార్నింగ్ ఇవ్వాలని అన్నారు దానికి కూడా శ్రీరామ్ దేనికైనా సమయం రావాలని పేర్కొనడం గమనార్హం ….

ధర్మవరం నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ పరిటాల శ్రీరామ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పట్టణంలోని దుర్గానగర్‌లో టీడీపీ ఆధ్వర్యంలో నిన్న నిర్వహించిన గౌరవసభ-ప్రజా సమస్యలపై చర్చావేదిక కార్యక్రమంలో పాల్గొన్న శ్రీరామ్ మాట్లాడుతూ.. ధర్మవరంలో టీడీపీ టికెట్ తెచ్చుకుంటానని ఓ నాయకుడు ప్రచారం చేసుకుంటున్నారని, నిజంగానే ఆయన టికెట్ తెచ్చుకుంటే తాను రాజకీయాల నుంచి వైదొలగుతానని ఓ మాజీ ఎమ్మెల్యేను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

అయినా, టీడీపీ కార్యకర్తలు ఇలాంటి వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. పార్టీ బలోపేతంపై ప్రతి ఒక్కరు దృష్టిసారించాలని కోరారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. టీడీపీతోనే రాష్ట్ర భవిష్యత్ అని, ఈ విషయాన్ని ప్రజలు విజ్ఞతతో ఆలోచించాలని పరిటాల శ్రీరామ్ కోరారు.

Leave a Reply

%d bloggers like this: