పోరాటాల ద్వారానే సమస్యల పరిష్కారం: జస్టిస్‌ చంద్రు

పోరాటాల ద్వారానే సమస్యల  పరిష్కారం: జస్టిస్‌ చంద్రు
చట్టాలు ఉన్నా అవి అమలుకు నోచుకోవడంలేదు
సామజిక ఆర్థిక అసమానతలు కొనసాగుతూనే ఉన్నాయి
పెదాలు నిరాదరణకు గురౌతూనే ఉన్నారు
గిరిజనులకు జరిగిన అన్యాయాలనుంచి వచ్చేదే జైభీమ్

జైభీమ్ సినిమాకు మూలకారణమైన వ్యక్తిగా నిలిచినా జస్టిస్ చంద్రు పేరు దేశంలో మారుమోగుతోంది. ఆయన సనాధారణ వ్యక్తిలాగా నిలిచినా ఒక అసామాన్యుడు .అందువల్ల దేశంలో పేదల కు జరుగుతున్న అన్యాయాలపై ఆయన తనదైన శైలిలో స్పందిస్తున్న తీరు న్యాయ కోవిదులను సైతం ఆకట్టుకుంటుంది. ఇటీవల ఆయన ఆంధ్రప్రదేశ్ లో సైతం పర్యటించారు . తన ఉపన్యాసాలలో సైతం తన అభిప్రాయాలను కొండబద్దలు కొట్టడం , నిజాన్ని నిర్భయంగా చెప్పటం ఆయనకు ప్రత్యేకత అందువల్ల హైద్రాబాద్ లో జరిగిన సెమినార్ లో సైతం ఆయన ఉపన్యాసం అందరిని ఆలోచింప చేసింది. పేదలకు న్యాయం జరిగినప్పుడే అంబెడ్కర్ ఆశయాలు నెరవేరినట్లు అవుతుందని చెప్పటం ద్వారా మంచి సందేశాన్ని ఇచ్చారు

పోరాటాల ద్వారానే సమస్యలకు పరిష్కారం సాధించుకోవాలని సూచించారు. ఉస్మానియ విశ్వవిద్యాలయంలోని లైబ్రరీ సెమినార్‌ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జస్టిస్‌ చంద్రు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాజ్యాంగంలో ఎన్నో చట్టాలు ఉన్నప్పటికీ అవి అమలు కావడం లేదని, నిరుపయోగంగా మారుతున్నాయని జస్టిస్‌ చంద్రు పేర్కొన్నారు. భారత రాజ్యాంగం, పౌర హక్కులు, సామాజిక న్యాయం అనే అంశంపై ఆయన ప్రసంగించారు.

రాజ్యాంగం అమల్లోకి వచ్చి 72 ఏళ్లైనా 102 సవరణలు చేసినా, నేటికీ సామాజిక, ఆర్థిక అసమానతలు కొనసాగుతూనే ఉన్నాయని అన్నారు. పేదలకు, నిరాదరణకు గురవుతున్న వాళ్లకు తగిన న్యాయం జరిగినప్పుడే రాజ్యాంగ రూపకర్త అంబేద్కర్‌ ఆశయం నెరవేరుతుందని చెప్పారు.

తాను చదువుకునే రోజుల్లో గిరిజనులు న్యాయం కోసం ఎక్కడికి వెళ్లాలో కూడా తెలియని స్థితిలో ఉండే వాళ్లని, అగ్రకులాలు, పోలీసులు కలిసి కొన్ని గిరిజన జాతులను దొంగలుగా ముద్ర వేశారని అన్నారు.

గిరిజన తెగలకు జరుగుతున్న అన్యాయంపై పోరాటం ఆధారంగానే జై భీమ్‌ సినిమా విడుదలై ఎంతో ప్రాచుర్యం పొందిందని జస్టిస్‌ చంద్రు చెప్పారు.

Leave a Reply

%d bloggers like this: