Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

మిర్చి రైతులకు ఎకరాకు లక్ష రూపాయలు పరిహారం ఇవ్వాలి…సిపిఎం

మిర్చి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి…
ఎకరానికి లక్ష నష్టపరిహారం ఇవ్వాలి…
కౌలు రైతులకు పరిహారంతో పాటు కౌలు చెల్లించాలి…

సిపిఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు

కలెక్టరేట్ వద్ద మాట్లాడుతున్న నున్నా

జెమినీ వైరస్ సోకి మిర్చి పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.మిర్చి పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి లక్ష రూపాయల పరిహారం ఇవ్వాలని కోరుతూ సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం ఖమ్మం పెవిలియన్ గ్రౌండ్ నుంచి ఖమ్మం కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. సందర్భంగా కలెక్టరేట్ వద్ద నిర్వహించిన ధర్నాలో నున్నా నాగేశ్వరరావు మాట్లాడారు.ఖమ్మం జిల్లాలో రైతులు లక్షా,10 వేల ఎకరాలకు పైగా మిర్చి పంట సాగు చేశారని,పంటకు వైరస్ సోకడంతో తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.రైతులు ఎకరాకు లక్ష నుంచి లక్షన్నర వరకు పెట్టుబడి పెట్టారని, లాభం రాకపోగా పెట్టిన పెట్టుబడి మొత్తం నష్టపోయారని తెలిపారు.వైరస్ వల్ల 85 శాతం వరకు రైతులు మిర్చి పంటను తొలగించారన్నారు.పంటకు వైరస్ సోకడంతో ఇప్పటికే ఖమ్మం జిల్లాలో ఆరుగురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి రైతులకు వెంటనే నష్టపరిహారం ఇవ్వాలని, లేనిచో రైతులు మనోవేదనకు గురై ఆత్మహత్యలకు పాల్పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.మంత్రులు, ఎంపీలు,ఎమ్మెల్యేలు కూడా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి రైతులను ఆదుకునే విధంగా కృషి చేయాలన్నారు.కౌలు రైతులకు నష్టపరిహారంతో పాటు అదనంగా కౌలు చెల్లించాలని కోరారు.5 వేల కోట్లు కేటాయించి రైతులకు పరిహారం ఇవ్వాలన్నారు. తెలంగాణ ఏర్పడిన ఏడు సంవత్సరాలలో ఎటువంటి విపత్తు జరిగిన ఇంతవరకు ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులను ఆదుకోలేదని విమర్శించారు.మిర్చిపంట నష్టాన్ని అధికారులతో సర్వే చేయించి,పరిహారాన్ని త్వరగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.నష్టపోయిన మిర్చి రైతులకు ఉచితంగా ఎరువులు, పురుగుమందులు ఇవ్వాలని కోరారు.పంట నష్టపోయి మనోవేదనకు గురవుతున్న రైతులకు ఆత్మస్థైర్యం కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసారు.నష్టపరిహారం చెల్లించని పక్షంలో రైతులను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళనలు,పోరాటాలు నిర్వహిస్తామన్నారు.

జాయింట్ కలెక్టర్ కు మెమోరాండం

ధర్నా అనంతరం జాయింట్ కలెక్టర్ మధుసూదన్ రావు కు మిర్చి రైతులను ఆదుకోవాలని వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పొన్నం వెంకటేశ్వరరావు,యర్రా శ్రీకాంత్,మాచర్ల భారతి,బుగ్గవిటి సరళ,భూక్య వీరభద్రం,చింతలచెర్వుకోటేశ్వరరావు,వై.విక్రమ్,తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు బొంతు రాంబాబు,మాదినేని రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

స్వలింగ వివాహాలను గుర్తించబోమన్న కేంద్రం!

Drukpadam

భాస్కర్ రెడ్డి పారిపోయే అవకాశం ఉందని అరెస్ట్ చేశాం: సీబీఐ

Drukpadam

బాసర ట్రిపుల్ ఐటీలో.. ఎగ్‌ఫ్రైడ్ రైస్ తిని 100 మందికి పైగా విద్యార్థులకు అస్వస్థత!

Drukpadam

Leave a Comment