Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
కోవిడ్ వార్తలు

ఒమిక్రాన్ పసిగట్టే సరికొత్త కిట్ రూపొందించిన ఐసీఎంఆర్!

ఒమిక్రాన్ పసిగట్టే సరికొత్త కిట్ రూపొందించిన ఐసీఎంఆర్!
-కిట్​ను డిబ్రుగఢ్​లోని ఐసీఎమ్​ఆర్​ ప్రాంతీయ పరిశోధనా కేంద్రం అభివృద్ధి చేసింది
-ఇంతవరకు ప్రపంచంలో ఇలాంటి కిట్ లేదు
-పేటంట్ హక్కులు మావే అంటున్న పరిశోధన కేంద్రం

ప్రపంచాన్ని వణికిస్తున్న కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్​ను పసిగట్టేందుకు.. భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎమ్​ఆర్) సరికొత్త కిట్​ను రూపొందించింది.

ఈ కిట్​ను వాణిజ్యపరంగా వినియోగించేందుకు, కిట్లను సొంతంగా అభివృద్ధి చేసి, కావాల్సిన సాంకేతికతను బదిలీ చేసేందుకు ఇన్​ విట్రో డయొగ్నాస్టిక్స్​ (ఐవీడీ) కిట్​ తయారీదారుల నుంచి ఎక్స్​ప్రెషన్​ ఆఫ్​ ఇంట్రెస్ట్​ (ఈఓఐ) కోసం ఆహ్వానించింది. ఒమిక్రాన్​ను గుర్తించేందుకు కావాల్సిన సాంకేతికత (రియల్​ టైమ్​ ఆర్​టీపీసీఆర్​ అస్సే), కిట్​ను డిబ్రుగఢ్​లోని ఐసీఎమ్​ఆర్​ ప్రాంతీయ పరిశోధనా కేంద్రం అభివృద్ధి చేసింది. దీనిపై మేథో సంపత్తి హక్కులు, వాణిజ్యపరమైన హక్కులు తమకే ఉంటాయని సంస్థ స్పష్టం చేసింది. ఒప్పందం కుదుర్చున్న వారికి కిట్​ను తయారు చేసి, అమ్ముకునే అధికారాన్ని ఇస్తామని వెల్లడించింది.
ప్రస్తుతం ఒమిక్రాన్​ను గుర్తించేందుకు ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి కిట్​లు లేవు. అనుమానిత రోగుల నుంచి నమూనాలను సేకరించి జినోమ్​ సీక్వెన్సింగ్​ కోసం ల్యాబ్‌లకు పంపిస్తున్నారు. దీంతో ఫలితాలు తేలేందుకు ఆలస్యమవుతోంది. ఈ తరుణంలో ఐసీఎమ్​ఆర్​ తాజా ప్రకటన ఊరటనిచ్చే విషయం. కిట్​ను ఉపయోగించి ఒమిక్రాన్​ను వేగంగా గుర్తించినట్లయితే.. రోగికి మెరుగైన చికిత్స అందిస్తూనే, వైరస్​ కట్టడికి చర్యలు చేపట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నిపుణులు పేర్కొంటున్నారు.

Related posts

కృష్ణపట్నం ఆయుర్వేద మందు పంపిణీకి బ్రేక్ :శాస్త్రీయత కావాలన్నా సీఎం జగన్…

Drukpadam

బంగారంతో కరోనా మాస్కు… ధర మామూలుగా లేదు మరి!

Drukpadam

ఒమిక్రాన్ కలకలం.. ఆఫ్రికా నుంచి వచ్చిన వందలాది మంది అడ్రస్ లేరు!

Drukpadam

Leave a Comment