పల్ల వెంకన్న నర్సరీలో గుభాళించిన జగన్ ముఖచిత్రం…

పల్ల వెంకన్న నర్సరీలో గుభాళించిన జగన్ ముఖచిత్రం…
విన్నూత్నo గా సీఎం జగన్ కు పూల అక్షర మాలతో పుట్టినరోజు శుభాకాంక్షలు…

రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా కడియం పల్ల వెంకన్న నర్సరీ విన్నూత్నo గా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసింది. పూల తో జగన్ ముఖచిత్రాన్ని రూపొందించి హ్యాపీ బర్త్ డే సిఎం సర్ అంటూ గుభాళించే సందేశాన్ని అందించారు. గత ఏడాది సీఎం జగన్ ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన నవరత్నాలు పధకాల సమూహాన్ని పూలతో,కూరగాయలు,మొక్కలతో రూపొందించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. కోవిడ్ కు ముందు తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖచిత్రాన్ని కూడా పూల కాన్వాస్ తో అద్భుతంగా రూపొందించి కేసీర్ దృష్టిని ఆకర్షించారు. ఇప్పుడు అదే తరహాలో రాజకీయలకతీతంగా సి ఎం జగన్ కు బొగడ,చిట్టిబంతి,చామంతి,గులాబీలు వంటి గుభాళించే పూలను ఉపయోగించి చక్కని చిత్రాన్ని ఆవిష్కరించారు. ఈ చిత్రం సందర్శకులకు,వైసీపీ అభిమానులకు కనువిందు చేస్తోంది. మర్యాదపూర్వకంగా సీఎం జగన్ కు పుట్టినరోజు గ్రీటింగ్స్ ఇవ్వడానికి,నర్సరీల ప్రాముఖ్యత, వైభవాన్ని చాటేందుకు ఈ విధమైన ప్రయత్నం చేశామని పల్ల వెంకన్న చారబుటిల్ ట్రస్ట్ చైర్మన్ పల్ల సత్యనారాయణ మూర్తి, మాజీ అధ్యక్షులు పల్ల సుబ్రహ్మణ్యం, ట్రస్ట్ డైరెక్టర్లు గణపతి,వెంకటేష్, వినయ్ లు తెలిపారు.

Leave a Reply

%d bloggers like this: