“ ఏపీకి హోదాకు బదులుగానే ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ఇచ్చాం”… కేంద్ర మంత్రి పంకజ్ చౌదరి!

“ ఏపీకి హోదాకు బదులుగానే ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ఇచ్చాం”… కేంద్ర మంత్రి పంకజ్ చౌదరి!
-ఇటీవల నీతిఆయోగ్ లో ప్రత్యేక సీఎం జగన్ ప్రత్యేక హోదా అడిగినమాట నిజమే
-ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాల్లో ,రాష్ట్రాల వాటా 10 శాతం భరించాలి
ఏపీ కి 2015 నుంచి 2020 వరకు వివిధ రకాల సహాయం అందించాం

ఢిల్లీ: ఏపీ కి స్పెషల్ స్టేటస్ పై కేంద్రం మళ్ళీ పాతపాటే పడింది . ప్రత్యేక హోదా బదులు ప్రత్యేక ప్యాకేజి కి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఒప్పుకున్నా విషయాన్నీ కేంద్రం గుర్తు చేసింది. అందువల్ల చంద్రబాబు నాయుడి హయాంలోనే ఏపీ కి స్పెషల్ స్టేటస్ బదులు ప్రత్యేక ప్యాకేజి ఇచ్చామని పేర్కొన్నది. ఈరోజు రాజ్యసభలో వైసీపీ నేత విజయసాయి రెడ్డి ప్రశ్నకు ఆర్థికశాఖ సహాయ మంత్రి పంకజ్‌ చౌదరి జవాబు ఇచ్చారు.

ఏపీకి ప్రత్యేక హోదాకు బదులుగానే ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ఇచ్చామని కేంద్ర మంత్రి పంకజ్‌ చౌదరి అన్నారు. ప్రత్యేక ప్యాకేజి కింద వివిధ రకాలుగా సహాయం చేశామని చెప్పారు.

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని సీఎం ఇటీవల నీతి అయోగ్‌తో విజ్ఞప్తి చేసిన విషయం వాస్తవమేనని, ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలలో కేంద్ర ప్రభుత్వ పథకాలలో 90 శాతం కేంద్రం వాటా, 10 శాతం రాష్ట్ర వాటా ఉంటుందన్నారు. అవశేష ఏపీ అభివృద్ధికి అవసరమైన సహాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. 2015-16 నుంచి 2019-20 వరకు రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్‌టర్నల్లీ ఎయిడెడ్‌ ప్రాజెక్ట్‌లకు రుణం సమకూర్చడంతోపాటు ఆ రుణంపై వడ్డీని కూడా కేంద్ర ప్రభుత్వమే చెల్లిస్తోందన్నారు. ఇప్పటివరకు 19 వేల కోట్లకు పైగా కేంద్రం ప్రత్యేక ప్యాకేజి కింద రాష్ట్రానికి సహాయం అందించామని కేంద్ర మంత్రి వివరించారు.

Leave a Reply

%d bloggers like this: