Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

దుబాయ్ రాజు ఖరీదైన విడాకులు భరణంగా రూ.5,525 కోట్లు!

ఖరీదైన విడాకులు.. భరణంగా దుబాయ్ రాజు రూ.5,525 కోట్లు చెల్లించాలని కోర్టు తీర్పు!

  • మహ్మద్ బిన్ రషీద్ తో విడాకులు కోరిన 6వ భార్య హయా
  • కీలక తీర్పును వెలువరించిన బ్రిటన్ హైకోర్టు
  • పిల్లల బాధ్యతలకు ఏటా రూ. 112 కోట్లు ఇవ్వాలని తీర్పు

దుబాయ్ రాజు మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్దూమ్ (72), ఆయన 6వ భార్య హయా బింట్ అల్ హుస్సేన్  (47) విడాకుల సెటిల్ మెంట్ విషయంలో బ్రిటన్ హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. ఏకంగా రూ. 5,525 కోట్ల మనోవర్తిని చెల్లించాలని దుబాయ్ రాజును ఆదేశించింది. ఇందులో రూ. 2,521 కోట్లను ఏకమొత్తంలో చెల్లించాలని తీర్పులో పేర్కొంది.

అంతేకాదు రషీద్, హయా సంతానం అల్ జలిలియా (14), జయాద్ (9) లకు చదువు కోసం రూ. 96 కోట్లు, వారి బాధ్యతల కోసం ప్రతి ఏటా రూ. 112 కోట్లు ఇవ్వాలని స్పష్టం చేసింది. ఇతర అవసరాల కోసం రూ. 2,907 కోట్లను బ్యాంకు గ్యారెంటీగా ఇవ్వాలని ఆదేశించింది. బ్రిటన్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన విడాకుల్లో ఇదొకటని విశ్లేషకులు అంటున్నారు.

హయా 2019లో దుబాయ్ నుంచి లండన్ వెళ్లిపోయారు. ఆ తర్వాత విడాకుల కోసం అక్కడి హైకోర్టులో పిటిషన్ వేశారు. అంతేకాదు తన పిల్లలను అప్పగించాలని కోర్టును కోరారు. అప్పటి నుంచి విచారణ జరుపుతున్న కోర్టు ఇప్పుడు సంచలన తీర్పును వెలువరించింది.

Related posts

Here Are 5 Ways You Can Get Younger-looking Skin Right Now

Drukpadam

గుండెపోటుకు ముఖ్య కారణం ఇదేనట..! తాజా అధ్యయనంలో వెల్లడి

Drukpadam

శ్రీశైలంలో భారీ అగ్నిప్రమాదం …!

Ram Narayana

Leave a Comment