ఉమ్మడి జిల్లాలోని పోలీస్ కేడర్‌ సర్దుబాటు ప్రక్రియను పారదర్శకం: విష్ణు ఎస్ వారియర్!

ఉమ్మడి జిల్లాలోని పోలీస్ కేడర్‌ సర్దుబాటు ప్రక్రియను పారదర్శకం: విష్ణు ఎస్ వారియర్!
-జీవో 317 ప్రకారం జోన్లకు కేటాయింపు
-ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పనిచేస్తున్న 2437 మంది పోలీస్ కానిస్టేబుళ్ల
-కేటాయించిన జిల్లాలో మూడు రోజుల్లో ఖచ్చితంగా రిపోర్ట్ చేయాలని
-సీనియారిటీ ప్రకారం కేటాయింపులు

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జీవో 317 ప్రకారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పనిచేస్తున్న 2437 మంది పోలీస్ కానిస్టేబుళ్ల సీనియారిటీ, అఫ్షన్ల ఆధారంగా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం , ములుగు, మహబూబాబాద్‌ జిల్లాలకు కేటాయిస్తూ.. పోలీస్ కమిషనర్ విష్ణుయస్.వారియర్ ఆధ్వర్యంలో ఆదేశాలు జారీ చేసినట్లు అడిషనల్ డీసీపీ (ఆడ్మీన్) గౌష్ ఆలమ్ తెలిపారు.

జిల్లా పోలీస్ అధికారుల ఆదేశాల మేరకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పనిచేస్తున్న ఏఆర్, సివిల్ పోలీస్ ఉద్యోగులు ఏ పరిధిలో పనిచేస్తారో ఆప్షన్‌ తో దరఖాస్తు చేసుకోవాలని అవకాశం ఇవ్వడంతో పోలీసు సిబ్బంది తమ ప్రతిపాదనలు అందజేశారని అడిషనల్ డీసీపీ (ఆడ్మీన్) తెలిపారు. ఆప్షన్లను పూర్తిస్థాయిలో పరిశీలించి జిల్లా కలెక్టర్ నేతృత్వంలో జిల్లా కమిటీ పలు దఫాలుగా పోలీస్ శాఖ, పోలీస్ అసోసియేషన్ బృందాలతో సమావేశమై సుదీర్ఘంగా చర్చలు జరిపి ప్రభుత్వ నిభందనలకు అనుగుణంగా ఆప్షన్లు , సీనియారిటీ ప్రకారం పోలీసులను విభజించి అయా జిల్లాల పరిధిలో పనిచేసే అవకాశం కల్పించినట్లు తెలిపారు. ప్రస్తుతం ఏఆర్, సివిల్ కానిస్టేబుళ్ల విభజన పక్రీయా పూర్తి కావడంతో అయా జిల్లాలకు కేటాయించినట్లు ఏఆర్, సివిల్ కానిస్టేబుళ్లకు సంక్షిప్త సమాచారం అందించామని తెలిపారు. పోలీస్ ఉద్యోగులకు కేటాయించిన జిల్లాలో మూడు రోజుల్లో (శుక్రవారం లోపు ) ఖచ్చితంగా రిపోర్ట్ చేయాలని పోలీస్ సిబ్బందికి ఈ సందర్భంగా సూచించారు.

ఉమ్మడి జిల్లా పరిధిలో మొత్తం 2437 (సివిల్ 1712, ఏఆర్ 725) మంది పోలీస్‌ కానిస్టేబుళ్లు ఉండగా..ఖమ్మం కమిషనరేట్‌ కు 810 మంది సివిల్ కానిస్టేబుళ్లు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు 779, మహబూబాబాద్ 44, ములుగు జిల్లాకు 79 మంది కానిస్టేబుళ్లను కేటాయించడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా ఖమ్మం కమిషనరేట్ కు 361 ఏఆర్ కానిస్టేబుళ్లను కేటాయించగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు 364 మంది కేటాయించడం జరిగిందన్నారు.

సివిల్ & ఏఆర్ హెడ్ కానిస్టేబుల్స్, ఏఎస్సై/ ఏఆర్ఎస్సై, ఎస్సైలను జోన్ల పరిధిలో పరిశీలన జరుగుతుందని తెలిపారు. ఉమ్మడి జిల్లాలోని పోలీస్ కేడర్‌ సర్దుబాటు ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేశామని అడిషనల్ డీసీపీ (ఆడ్మీన్) తెలిపారు.

Leave a Reply

%d bloggers like this: