Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఢిల్లీకి వచ్చిన మంత్రులను అవమానిస్తున్నారు …మంత్రి నిరంజన్ రెడ్డి ఫైర్

ఢిల్లీకి వచ్చిన మంత్రులను అవమానిస్తున్నారు …మంత్రి నిరంజన్ రెడ్డి ఫైర్
-బాధ్యతలను విస్మరించిన కేంద్రం రాష్ట్రాలపై దాడి చేస్తోందని ధ్వజం
-రగులుతున్న ధాన్యం కొనుగోలు అంశం
-కేంద్రం వర్సెస్ తెలంగాణ
-సమస్య పరిష్కారం కోసం ఢిల్లీలో పడిగాపులు కాస్తున్నామన్న మంత్రి

వరిధాన్యం కొనమని అడిగేందుకు వచ్చిన తెలంగాణ మంత్రులను కేంద్రం అవమానిస్తుందని తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఫైర్ అయ్యారు. కేంద్రం వ్యవహరిస్తున్న తీరు రైతులకు నష్టం చేస్తుందని ధ్వజమెత్తారు . కేంద్రం ధాన్యం కొనుగోలు చేయాల్సిన బాధ్యతల ను విస్మరించి రాజకీయం చేస్తుందని మండిపడ్డారు .మేము రెండు రోజులుగా మంత్రిని కలిసేందుకు వచ్చి ఢిల్లీలో ఉంటె కనీసం కలిసేందుకు సమయం ఇవ్వకపోవడం దారుణమని అన్నారు. కేంద్రం రైతుల విషయంలో దాడులు చేయటం దారుమని అన్నారు .కేంద్రం రాష్ట్రాలపై దాడి చేస్తుందని అన్నారు . కేంద్రం చర్యలు ఇదే విధంగా ఉంటె రైతుల ఆగ్రహం చూడవలసి వస్తుందని అన్నారు.

ధాన్యం కొనుగోలు అంశంపై కేంద్రంతో తెలంగాణ సర్కారు పోరాటం కొనసాగుతోంది. ధాన్యం సేకరణ అంశాన్ని ఓ కొలిక్కి తెచ్చేందుకు ఢిల్లీలో పడిగాపులు కాస్తున్నామని, రెండ్రోజుల్లో నిర్ణయం చెబుతామన్న కేంద్రం ఇంతవరకు స్పందించలేదని రాష్ట్ర మంత్రి నిరంజన్ రెడ్డి ఆరోపించారు.

మేం ఢిల్లీకి వచ్చింది ప్రేమలేఖలు రాయడానికి అన్నట్టుగా కేంద్రమంత్రుల వైఖరి ఉందని విమర్శించారు. ఏ ఒక్క అంశంలోనూ కేంద్రం నుంచి సరైన రీతిలో సాయం అందడంలేదని అన్నారు. బాధ్యతలను విస్మరించిన కేంద్రం రాష్ట్రాలపై దాడి చేస్తోందని నిరంజన్ రెడ్డి మండిపడ్డారు.

“ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు. అదే సమయంలో బ్యాంకు రుణాల ఎగవేతకు పాల్పడిన పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తున్నారు. ఇంకెవ్వరూ వ్యవసాయాన్ని వృత్తిగా చేపట్టని రీతిలో నిరుత్సాహకరంగా వ్యవహరిస్తున్నారు. ఆఖరికి జీఎస్టీ నిధులను కూడా అడుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అడిగేందుకు వచ్చిన మంత్రులను అవమానిస్తున్నారు” అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేంద్రం విధానాలతో రైతులు బాధపడుతున్నారని, కార్పొరేట్ సంస్థలకు దగ్గరుండి ఒప్పందాలు కుదుర్చుతున్న ప్రభుత్వం రైతులను మాత్రం పట్టించుకోవడంలేదని విమర్శించారు.

Related posts

మమ్మల్ని చంపేయ్…లేదా నువ్వు చస్తావ్…కొడాలినాని బుద్ధా వెంకన్న వార్నింగ్…!

Drukpadam

కొలువు తీరిన ఆఫ్ఘన్ తాత్కాలిక తాలిబన్ కొత్త ప్రభుత్వం!

Drukpadam

హుజూరాబాద్‌లో ఈటల గెలుపు పక్కా: కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి!

Drukpadam

Leave a Comment