Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
కోవిడ్ వార్తలు

భారత్ లో కొత్తగా 6,650 కరోనా కేసులు మరణాలు 374..!

భారత్ లో కొత్తగా 6,650 కరోనా కేసులు మరణాలు 374..!
రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరిక …
రాత్రిపూట కర్ఫ్యూ అమలుకు పరిశీలన
మహారాష్ట్ర, ఢిల్లీ, తెలంగాణ లలో పెరుగుతున్న కేసులు

ఇండియా కరోనా కేసులు మళ్లీ పెరుగుతూ.. పెరుగుతూ ఉన్నాయి. కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్‌ ప్రకారం. గత 24 గంటల్లో కొత్తగా 6,650 కోవిడ్‌ పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి..
మరో 374 మంది కోవిడ్‌ బాధితులు ప్రాణాలు వదిలారు. దీంతో దేశం లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,47,72,626 కు చేరుకుంది. అలాగే రికవరీల సంఖ్య 3,42,15,977 కు చేరింది. ఇక మరణాల సంఖ్య 4,79,133 కు చేరుకుంది. ఇక, ప్రస్తుతం దేశవ్యాప్తంగా 77,516 యాక్టివ్‌ కేసులు ఉన్నట్టు బులెటిన్‌లో పేర్కొంది కేంద్రం. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ కొనసాగుతుండగా.. ఇప్పటి వరకు 1,40,31,63,063 మందికి టీకా వేసినట్లు బులెటిన్‌లో పేర్కొంది కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.

ఏపీలో మరో రెండు ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి. విదేశాల నుంచి వచ్చిన విశాఖ, తూర్పుగోదావరి జిల్లా వాసులకు ఒమిక్రాన్‌ నిర్ధారణ అయినట్లు వైద్యారోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. తూర్పుగోదావరి జిల్లా అయినవిల్లి మండలం నేదునూరు పెదపాలెంకు చెందిన మహిళతో పాటు విశాఖకు చెందిన వ్యక్తికి వైరస్‌ నిర్ధారణ అయింది.

తూర్పుగోదావరి జిల్లా మహిళ ఈనెల 19న కువైట్‌ నుంచి విజయవాడ వచ్చి అక్కడి నుంచి స్వస్థలానికి వెళ్లారు. విశాఖ వ్యక్తి ఈనెల 15న దుబాయ్‌ నుంచి వచ్చారు. వీరిద్దరికి వైద్య పరీక్షలు నిర్వహించి నమూనాలను జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కు పంపగా ఒమిక్రాన్‌ సోకినట్లు తేలిందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం బాధితులు ఇద్దరూ ఆరోగ్యంగానే ఉన్నారని.. వారి కుటుంబసభ్యులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు. తాజా కేసులతో ఏపీలో ఒమిక్రాన్‌ సోకిన వారి సంఖ్య నాలుగుకి చేరింది.

Related posts

కర్ణాటకపై కరోనా పంజా… నిన్న ఒక్క రోజులోనే 39,305 కేసులు !

Drukpadam

ప్రజల ప్రాణాలకన్నా ప్రచారానికే మోడీ ప్రాధాన్యత …. ప్రియాంక మండిపాటు

Drukpadam

రాష్ట్రంలో కొన్ని వారాలైనా లాక్ డౌన్ పెట్టాలి…సీఎల్పీ నేత భట్టి

Drukpadam

Leave a Comment