Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

హైదరాబాద్ సీపీగా సీవీ ఆనంద్.. 30 మంది ఐపీఎస్‌ల బదిలీ

హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా సీవీ ఆనంద్.. అవినీతి నిరోధకశాఖ డీజీగా అంజనీకుమార్ బదిలీ

 
  • మూడేళ్ల తర్వాత భారీగా బదిలీలు
  • ఇటీవల కేంద్ర సర్వీసుల నుంచి వచ్చిన సీవీ ఆనంద్
  • నారాయణపేట ఎస్పీ చేతనకు పోస్టు కేటాయించని ప్రభుత్వం
  • త్వరలో మరిన్ని బదిలీలకు అవకాశం

రాష్ట్రంలో భారీగా పోలీసు అధికారుల బదిలీలు, పోస్టింగ్‌లకు సంబంధించిన ఉత్తర్వులను తెలంగాణ ప్రభుత్వం జారీ చేసింది. 30 మంది ఐపీఎస్‌ అధికారులను బదిలీ చేసినట్లు పేర్కొంది.

  • తెలంగాణ ప్రభుత్వం భారీ ఎత్తున ఐపీఎస్ బదిలీలు చేపట్టింది. మొత్తంగా 30 మంది ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ గత రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా ఉన్న అంజనీకుమార్‌ను అవినీతి నిరోధకశాఖ డీజీగా బదిలీ చేసింది. ఇటీవలే కేంద్ర సర్వీసుల నుంచి వచ్చిన సీవీ ఆనంద్‌ను ఆయన స్థానంలో హైదరాబాద్ సీపీగా నియమించింది.

సిద్దిపేట, నిజామాబాద్ పోలీస్ కమిషనర్లు, 11 జిల్లాల ఎస్పీలను బదిలీ చేయగా, నారాయణపేట ఎస్పీ చేతనకు ఎలాంటి పోస్టు కేటాయించలేదు. అంతేకాదు, ఒకటి రెండు రోజుల్లో మరిన్ని బదిలీలు జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. తెలంగాణ ప్రభుత్వం ఈ స్థాయిలో బదిలీలు చేపట్టడం గత మూడేళ్లలో ఇదే తొలిసారి.

ఇక హైదరాబాద్ కొత్త సీపీగా నియమితులైన సీవీ ఆనంద్ ఏప్రిల్ 2018లో కేంద్ర సర్వీసులకు వెళ్లి మూడున్నర నెలల కిందట తిరిగి తెలంగాణ కేడర్‌కు బదిలీపై వచ్చారు. ఇప్పుడాయనకు హైదరాబాద్ సీపీగా కీలక బాధ్యతలు అప్పగించారు. సుదీర్ఘకాలంగా రాచకొండ కమిషనర్‌గా ఉన్న మహేశ్ భగవత్‌ను మాత్రం అక్కడే ఉంచారు.

అలాగే, డీసీపీలుగా ఉంటూ పనిచేస్తున్న చోటే డీఐజీలుగా పదోన్నతులు పొంది కొనసాగుతున్న ఏఆర్ శ్రీనివాస్, ఏవీ రంగనాథ్, కార్తికేయ, అవినాశ్ మహంతికి చాలా కాలం తర్వాత కొత్త పదవులు దక్కాయి. నాన్ కేడర్ ఎస్పీలుగా ఉంటూ మూడు రోజుల కిందట ఐపీఎస్‌లుగా పదోన్నతులు పొందిన కోటిరెడ్డి, కేఆర్ నాగరాజ్, ఉదయ్ కుమార్‌రెడ్డి, జగదీశ్వరరెడ్డి, మనోహర్, శిల్పవల్లి వంటి అధికారులకు కీలక పోస్టులు లభించాయి.

 

హైదరాబాద్ సీపీగా సీవీ ఆనంద్, ఏసీబీ డీజీగా అంజనీకుమార్, ఏసీబీ డైరెక్టర్గా శిఖా గోయల్, హైదరాబాద్ జాయింట్ సీపీ (క్రైమ్స్)గా ఏఅర్ శ్రీనివాస్, హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీగా రంగనాథ్, నల్గొండ ఎస్పీగా రామ రాజేశ్వరి, సిద్దిపేట్ సీపీగా శ్వేత, హైదరాబాద్ వెస్ట్ జోన్ డీసీపీగా జోయల్ డేవిస్, మెదక్ ఎస్పీగా రోహిణి ప్రియదర్శిని, సైబరాబాద్ డీసీపీ (క్రైమ్స్)గా కల్మేశ్వర్, సైబరాబాద్ జాయింట్ సీపీగా అవినాష్ మహంతి, హైదరాబాద్ నార్త్ జోన్ డీసీపీగా చందనా దీప్తి, హైదరాబాద్ సీసీఎస్‌ డీసీపీగా గజరావు భూపాల్, హైదరాబాద్ ఎస్బీఐ జాయింట్ సీపీగా విశ్వప్రసాద్, వికారాబాద్ ఎస్పీగా కోటిరెడ్డి, నిజామాబాద్ సీపీగా నాగరాజు, అదిలాబాద్ ఎస్పీగా ఉదయ్ కుమార్ రెడ్డి, మాదాపూర్ జోన్ డీసీపీగా శిల్పవల్లి, బాలానగర్ డీసీపీగా సందీప్ గొనె, శంషాబాద్ డీసీపీగా జగదీష్ రెడ్డి, హైదరాబాద్ కార్ హెడ్ క్వాటర్ జాయింట్ సీపీగా కార్తికేయ, మహబూబాబాద్ ఎస్పీగా శరత్ చంద్ర పవార్, హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీ 1గా ప్రకాష్ రెడ్డి, ఆసిఫాబాద్ ఎస్పీగా సురేష్ కుమార్, నిర్మల్ ఎస్పీగా ప్రవీణ్ కుమార్, నాగర్ కర్నూల్ ఎస్పీగా మనోహర్, కామారెడ్డి ఎస్పీగా శ్రీనివాస్ రెడ్డి, జయశంకర్ భూపాలపల్లి ఎస్పీగా సురేందర్ రెడ్డి, జనగాం డీసీపీగా సీతారామ్, నారాయణ్‌పేట్‌ ఎస్పీగా ఎన్ వెంకటేశ్వర్లును నియమిస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.

Related posts

భర్తను ఆన్ లైన్ లో వేలం వేసిన మహా ఇల్లాలు!

Drukpadam

మొదలైన మేడారం మినీ జాతర..క్యూకడుతున్న భక్తులు…

Drukpadam

సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణను కలిసిన జగన్!

Drukpadam

Leave a Comment