Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

బ్రిటన్ లో ఉడతకు మరణశిక్ష.. ఎందుకో తెలుసా !

18 మందిని కొరికి గాయపరిచిన ఉడతకు మరణశిక్ష.. ఇంజెక్షన్ ఇచ్చి శిక్ష అమలు

  • బ్రిటన్‌లోని బక్లీ పట్టణంలో ఘటన
  • రెండు రోజుల్లో 18 మందిని గాయపరిచిన వైనం
  • ఓ సినిమాలోని విలన్ పేరు పెట్టిన స్థానికులు
  • అడవిలో వదిలిపెట్టేందుకు అంగీకరించని స్థానిక చట్టాలు

మనుషులను కొరికి గాయపరుస్తున్న ఓ ఉడతకు మరణశిక్ష విధించి అమలు చేశారు. బ్రిటన్‌ ఫ్లింట్‌షైర్‌లోని బక్లీ పట్టణంలో జరిగిందీ ఘటన. రెండు రోజుల్లో 18 మందిని గాయపరిచిన ఈ ఉడతకు ఇంజెక్షన్ ఇవ్వడం ద్వారా శిక్ష అమలు చేశారు.

ఆ వివరాలలోకి వెళితే, కొరిన్ రెనాల్డ్స్ పక్షి ప్రేమికురాలు. ఆమెకు మచ్చికైన ఓ ఉడత రోజూ వచ్చి ఆమె పెట్టే ఆహారం తీసుకునేది. ఈ క్రమంలో క్రిస్మస్‌కు కొన్ని రోజుల ముందు ఆహారం పెడుతున్న సమయంలో ఉడత ఆమె చేతిని కొరికి పారిపోయింది. తనతో ఎంతో సఖ్యతగా ఉండే ఉడత అనూహ్య ప్రవర్తనకు ఆమె విస్తుబోయింది.

ఆ తర్వాత ఓ రోజు ఫేస్‌బుక్ చూస్తున్న కొరిన్ విస్తుపోయింది. అందులో పోస్టులన్నీ దాదాపు ఉడత గురించే. ఉడత తమ చేతిని కొరికి గాయపరిచిందన్న పోస్టులు చూసి షాకయ్యారు. క్రిస్మస్ రోజున పట్టణం మొత్తం ఈ ఉడత తీరు చర్చనీయాంశమైంది. అంతేకాదు, ఆ ఉడతకు ‘గ్రెమ్లిన్స్’ సినిమాలోని విలన్ పేరు ‘స్ట్రైప్’ అని పేరు కూడా పెట్టేశారు.

ఈ ఉడతను ఇలాగే వదిలేస్తే ప్రమాదమని భావించిన కొరిన్ దానికి ఆహారం వేసే చోట ఉచ్చు పెట్టి బంధించింది. అనంతరం ఆ ఉడతను ‘ద రాయల్ సొసైటీ ఫర్ ద ప్రివెన్షన్ ఆఫ్ క్రూయాల్టీ టు యానిమల్స్’ సంస్థ స్వాధీనం చేసుకుంది. ప్రజలను గాయపరుస్తున్న ఆ ఉడతను అడవిలో వదిలేద్దామని తొలుత భావించారు. అయితే, అందుకు స్థానిక చట్టాలు అంగీకరించకపోవడంతో ఇంజెక్షన్ ఇచ్చి దానికి మరణశిక్ష విధించారు.

Related posts

డొమినికా పోలీసుల అదుపులో మెహుల్ చోక్సీ.. అంటిగ్వా పోలీసులకు అప్పగించే ప్రయత్నాలు

Drukpadam

ఈసారి రివర్స్… చైనా గగనతలంలో అమెరికా బెలూన్లు!

Drukpadam

అప్పు చేసి, భూమి తాకట్టు పెట్టి మరీ ఏఈఈ పేపర్ కొనుగోలు!

Drukpadam

Leave a Comment