వంగవీటి రాధా ఇంటికి చంద్రబాబు ….రాధపై రెక్కీ కారు ఎవరిదో తేల్చాలని డిమాండ్!

వంగవీటి రాధా ఇంటికి చంద్రబాబు ….రాధపై రెక్కీ కారు ఎవరిదో తేల్చాలని డిమాండ్!
-తన హత్యకు రెక్కీ జరిగిందన్న వంగవీటి రాధా
-దోషులను కాపాడేలా ప్రభుత్వ వైఖరి ఉందని వ్యాఖ్యలు
-అసలు దోషులను తప్పిస్తారా? అంటూ ఆగ్రహం
– నివాసానికి వెళ్లిన టీడీపీ అధినేత చంద్రబాబు
-తన హత్యకు రెక్కీ జరిగిందన్న వంగవీటి రాధా
-రాధా వ్యాఖ్యలతో రాజకీయ సంచలనం
-రాధాతో స్వయంగా మాట్లాడిన చంద్రబాబు
-భద్రత విషయంలో నిర్లక్ష్యం వద్దని సూచన

తన హత్యకు రెక్కీ జరిగిందంటున్న వంగవీటి రాధాను టీడీపీ అధినేత చంద్రబాబు నేడు ఆయన నివాసానికి స్వయంగా వెళ్లి కలిశారు. రాధాతో మాట్లాడి రెక్కీపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. భద్రత విషయంలో నిర్లక్ష్యం వద్దని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రాధాకు సూచించారు. రాధాకు టీడీపీ పూర్తి అండగా ఉంటుందని చంద్రబాబు ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు. కుట్ర రాజకీయాలపై పార్టీపరంగా పోరాడదామని పేర్కొన్నారు. రాధా హత్యకు రెక్కీపై చంద్రబాబు ఇటీవలే డీజీపీ గౌతమ్ సవాంగ్ కు లేఖ రాశారు. అనంతరం చంద్రబాబు స్పందిస్తూ, రాధాపై రెక్కీ సమయంలో వచ్చిన కారు ఎవరిదో పోలీసులు తేల్చాలని డిమాండ్ చేశారు. సెక్యూరిటీ ఇస్తామని చెప్పి అసలు దోషులను తప్పిస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాధాపై రెక్కీ జరిగిందా లేదా అనేది చెప్పాల్సిన బాధ్యత ఎవరిదని ప్రశ్నించారు.

రెక్కీపై పోలీసుల వద్ద ఉన్న ఆధారాలు కూడా బయటపెట్టాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. పోలీసులు కావాలనే కాలయాపన చేస్తున్నారనిపిస్తోందని ఆరోపించారు. “రెక్కీపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడంలేదు? దోషులను కాపాడేలా ప్రభుత్వ వైఖరి ఉంది. రెక్కీ ఘటనపై ప్రభుత్వం సీరియస్ గా స్పందించడంలేదు. వారం గడుస్తున్నా ఇంతవరకు ఏమీ తేల్చలేదు. నా లేఖ ఆధారంగా విచారణ చేయలేరా? ఇలాంటి ఘటనల్లో కాలయాపన మంచిది కాదు” అని స్పష్టం చేశారు.

కాగా, రాధాపై రెక్కీ అంశాన్ని మంత్రి కొడాలి నాని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లడం తెలిసిందే. వెంటనే స్పందించిన సీఎం జగన్ 2 ప్లస్ 2 భద్రత కల్పించేందుకు ఆదేశాలు ఇచ్చినా, తాను నిత్యం ప్రజల్లో ఉండేవాడ్నని, తనకు ఎలాంటి భద్రత వద్దని రాధా తిరస్కరించారు.

Leave a Reply

%d bloggers like this: