కాంగ్రెస్ లో జగ్గారెడ్డి మంటలు … కేటీఆర్ కోవర్ట్ అంటూ ప్రచారం

కాంగ్రెస్ లో జగ్గారెడ్డి మంటలు… కేటీఆర్ కోవర్ట్ అంటూ ప్రచారం
-తీవ్రంగా స్పందించిన జగ్గారెడ్డి
-ఇటీవల కేటీఆర్ తో ముచ్చటించిన జగ్గారెడ్డి
-రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం
-టీఆర్ఎస్ ఏజెంట్ నంటూ ప్రచారం చేస్తున్నారని జగ్గారెడ్డి ఆగ్రహం
-వెళ్లాలనుకుంటే నేరుగానే టీఆర్ఎస్ లోకి వెళ్లగలనని ధీమా

కాంగ్రెస్ పార్టీలో జగ్గారెడ్డి మంటలు ఇంకా చల్లారలేదు … ఇటీవల ఆయన పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై నేరుగా ఐసీసీ అధ్యక్షురాలు సోయానియాకు లేక రాయడం దానిపై కాంగ్రెస్ లో భిన్న స్వరాలూ వినిపించడం చూస్తున్నాం . ఉమ్మడి మెదక్ జిల్లా లోని సీఎం స్వగ్రామం ఎర్రవల్లిలో రచ్చబండ కార్యక్రమం చేపట్టిన రేవంత్ రెడ్డి ,సంగారెడ్డి ఎమ్మెల్యే ,పీసీసీ ఉపాధ్యక్షుడిగా ఉన్న జగ్గారెడ్డి కి చెప్పలేదు … తనకు చెప్పకుండా ఎర్రవల్లిలో కార్యక్రమం పెట్టడంపై జగ్గారెడ్డి మండిపడ్డారు . చివరకు పీసీసీ చీఫ్ గా రేవంతరెడ్డి ని మార్చండి. లేదా ఆయన ధోరణి మార్చండి అంటూ అందులో పేర్కొన్నారు. అంతుకుముందు సీనియర్లు రేవంత్ నియామకంపై గుర్రుగా ఉన్నారు . అది సర్దుకుంటుందని అనుకుంటున్న తరణంలో జగ్గారెడ్డి వ్యవహారం తెరపైకి వచ్చింది.

ఇటీవల సంగారెడ్డి కలెక్టరేట్ లో కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మంత్రి కేటీఆర్ తో ముచ్చటించడం రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే, తాను కేటీఆర్ కోవర్టునంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని జగ్గారెడ్డి మండిపడ్డారు. గతంలో కాంగ్రెస్ నేతలు ఎవరూ కేటీఆర్ ను కలవలేదా? అని ప్రశ్నించారు. ప్రత్యర్థి పార్టీల నేతలు ఎదురుపడినప్పుడు పలకరించడం, మాట్లాడడం సంస్కారం అని స్పష్టం చేశారు. కేటీఆర్ తోనూ ఆ విధంగానే మాట్లాడానని అన్నారు. కేటీఆర్ తన భుజంపై చేయి వేసినా, తాను ఆయన భుజంపై చేయి వేయలేదని వివరణ ఇచ్చారు.

అయితే, తాను టీఆర్ఎస్ ఏజెంట్ నంటూ ప్రచారం చేస్తున్నారని జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను వెళ్లాలనుకుంటే నేరుగా టీఆర్ఎస్ లోకి వెళ్లగలనని తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో చిల్లర బ్యాచ్ తయారైందని ఆయన విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీని నాశనం చేస్తుంది ఎవరు? నేనా… ఓ వ్యక్తి అభిమాని సంఘాలా? అని ప్రశ్నించారు. పీసీసీ పదవి అంటే ఎంతో బాధ్యతతో కూడుకున్నదని జగ్గారెడ్డి పేర్కొన్నారు.

Leave a Reply

%d bloggers like this: