ఒవైసీని అరెస్ట్ చేస్తే .. రూ. 22 లక్షలు…ప్రకటించిన హిందూ సంఘాలు!

ఒవైసీని అరెస్ట్ చేయండి.. రూ. 22 లక్షలు అందుకోండి: ప్రకటించిన హిందూ సంఘాలు

  • గురుగ్రామ్‌లో హిందూ సంఘాల ర్యాలీ
  • కాళీ చరణ్ మహరాజ్‌ను విడుదల చేయాలని డిమాండ్
  • నమాజ్‌కు వ్యతిరేకంగా, గాడ్సేను పొగుడుతూ నినాదాలు

ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీని అరెస్ట్ చేస్తే రూ. 22 లక్షలు ఇస్తామని పలు హిందూ సంఘాలు ప్రకటించాయి. మహాత్మాగాంధీని కించపరుస్తూ, ఆయనను కాల్చి చంపిన గాడ్సేను ఆకాశానికెత్తేస్తూ వ్యాఖ్యలు చేసినందుకు గాను గత నెల 30న కాళీచరణ్ మహారాజ్‌ను ఛత్తీస్‌గఢ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో ఆయనను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ 22 హిందూ సంఘాలకు చెందిన ఆందోళనకారులు నిన్న గురుగ్రామ్‌లో ఆందోళనకు దిగారు.

డిప్యూటీ కమిషనర్ ఇంటి నుంచి కార్యాలయం వరకు పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా నమాజ్‌ను వ్యతిరేకిస్తూ, నాథూరాం గాడ్సేను పొగుడుతూ నినాదాలు చేశారు. ఆయా సంఘాల నేతలు మాట్లాడుతూ.. అసదుద్దీన్ ఒవైసీని అరెస్ట్ చేసిన వారికి రూ. 22 లక్షల నజరానా ఇస్తామని ప్రకటించారు. కాగా, ఈ ఆందోళనకు సంయుక్త హిందూ సంఘర్ష్ సమితికి చెందిన కుల్‌భూషణ్ భరద్వాజ్ నేతృత్వం వహించారు.

Leave a Reply

%d bloggers like this: