ఢిల్లీలో ఏపీ సీఎం ప్రదక్షణలు …కనికరించారా ? కస్సుమన్నారా ??

ఢిల్లీలో ఏపీ సీఎం ప్రదక్షణలు …కనికరించారా ? కస్సుమన్నారా ??
ఈ సాయంత్రం తిరుగు ప్రయాణం
ప్రత్యేకహోదా ,పోలవరం నిధులు ,పెండింగ్ ప్రాజక్టులపై విన్నపాలు
ఢిల్లీలో బిజీ బిజీగా సీఎం జగన్..
నిన్న మోదీ, పలువురు కేంద్ర మంత్రులతో సీఎం భేటీ
వైసీపీ ఎంపీలతో కలిసి నిన్న మధ్యాహ్నం భోజనం
దొరకని అమిత్ షా అపాయింట్మెంట్

ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా గడిపారు . ఇక ఇక్కనుంచి షరామామూలే …ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రెండు రోజులపాటు ఢిల్లీలో ప్రధానితో పాటు అరడజను మంది మంత్రులను కలిశారు. వారు చుట్టూ ప్రదక్షణలు చేశారు. వారు కనికరించారా ? కస్సుమన్నారా ? అనేది ఇంకా స్పష్టం కాలేదు . ఎప్పటిలాగానే ప్రధానిని మంత్రులను కలవడం బొకేలు ,దేవుళ్ళ ప్రతిమలు ప్రసాదాలు అందిచడం శాలువాలతో సత్కరించడం … ఏపీ కి సంబందించిన ప్రత్యేకహోదా , పోలవరం నిధుల వ్యవహారం ఇతర ప్రాజక్టులు , తెలంగాణ ,ఏపీ మధ్య విభజన ఒప్పందాలు , కేంద్రం హామీ మేరకు ఇవ్వాల్సిన రెవిన్యూ లోటు . అంశాలపై ప్రధానికి సమగ్రమైన నివేదిక అందజేశారు. ప్రధానితో గంటపాటు సీఎం జగన్ భేటీ అయ్యారు. రాష్ట్ర అభివృద్ధికి సంబందించిన సమస్యలతోపాటు , రాజకీయ అంశాలుకూడా వారి మధ్య చర్చకు వచ్చే అవకాశం లేకపోలేదు .

అక్కడు నుంచి నేరుగా విత్త మంత్రి నిర్మల సీతారామన్ ను కలిశారు. ప్రత్యేక హోదా,పోలవరం నిధుల గురించి ప్రస్తావించారు. తరువాత పౌరవిమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాను కలిశారు. కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్, మధ్యాహ్నం 12 గంటలకు కేంద్ర విద్య, నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తో సమావేశం అయ్యారు . అంతకు ముందు

మరోవైపు నిన్న మధ్యాహ్నం ఢిల్లీలోని జనపథ్ – 1 అధికార నివాసంలో పార్టీ ఎంపీలతో కలిసి ఆయన భోజనం చేశారు. ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, మార్గాని భరత్, బాలశౌరి, నందిగం సురేశ్, గోరంట్ల మాధవ్, ఎంవీవీ సత్యనారాయణ ఇందులో పాల్గొన్నారు.

 

 

ఢిల్లీలో ఏపీ సీఎం జగన్ రెండో రోజు పర్యటనలో . కేంద్ర మంత్రి నితిన్ గడ్క‌రీతో జ‌గ‌న్ స‌మావేశ‌మై ప‌లు అంశాల‌పై చర్చించారు . ఏపీలో ర‌హ‌దారుల నిర్మాణం, జాతీయ ర‌హ‌దారుల విస్త‌ర‌ణ‌పై ఆయ‌న గ‌డ్క‌రీ కి వివరించి కేంద్ర సహాయాన్ని కోరారు . తీర ప్రాంతం వెంబ‌డి నాలుగు లైన్ల ర‌హ‌దారుల నిర్మాణం చేప‌ట్టాల‌ని ఆయ‌న కోరారు. విశాఖ‌-భోగాపురం జాతీయ ర‌హ‌దారి నిర్మాణంపై చ‌ర్చించారు.

విజ‌య‌వాడ తూర్పు హైవే ఏర్పాటుపై కూడా కేంద్రం మంత్రి దృష్టికి తెచ్చారు . అలాగే, ఏపీలోని పెండింగ్ ప్రాజెక్టుల‌కు త్వ‌ర‌గా అనుమ‌తులు మంజూరు చేయాల‌ని కోరారు . ఈ సాయత్రం ఆయన తన ఢిల్లీ పర్యటన ముగించుకొని తాడేపల్లి కి చేరుకున్నారు .

Leave a Reply

%d bloggers like this: