Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
సినిమా వార్తలు

ఇద్దరినీ కలిపింది …సినిమా టికెట్స్ వివాదం…

ఇద్దరినీ కలిపింది …సినిమా టికెట్స్ వివాదం…

వర్మా… నువ్వు చెప్పింది అక్షరాలా నిజం: నాగబాబు
కొనసాగుతున్న సినిమా టికెట్ల వివాదం
ఏపీ ప్రభుత్వానికి 10 ప్రశ్నలు సంధించిన రామ్ గోపాల్ వర్మ
వీడియో విడుదల
ట్విట్టర్ లో స్పందించిన నాగేంద్రబాబు

రాంగోపాల్ వర్మ కు మెగా బ్రదర్స్ కు పచ్చగడ్డి వేస్తె భగ్గుమనే పరిస్థితి …కానీ ఇద్దరినీ కలిపింది ఏపీ లోని సినిమా టికెట్స్ వ్యవహారం … సినిమా టికెట్స్ వ్యవహారంపై రాంగోపాల్ వర్మ ఏపీ ప్రభుత్వానికి వేసిన 10 ప్రశ్నలపై స్పందించారు…. వర్మా బాగా స్పందించావని నాగబాబు ప్రశంసించించారు .అంటే కాకుండా దాన్ని రిట్విట్ చేశారు. దానికి వర్మ కూడా థాంక్యూ నాగబాబు గారు చిత్రపరిశ్రమనుంచి మరింతమంది స్పందించాలని అన్నారు .

సినిమా టికెట్ల వివాదం ఇంకా రగులుతూనే ఉంది. దీనిపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏపీ ప్రభుత్వానికి 10 ప్రశ్నలు సంధించడం తెలిసిందే. సినిమా టికెట్ల అంశంలో ప్రభుత్వ జోక్యం తగదని వర్మ పేర్కొన్నారు. ఒకవేళ సినిమా అనేది నిత్యావసర వస్తువు అని ప్రభుత్వం భావిస్తే, రాయితీలు ఇవ్వాలని స్పష్టం చేశారు. ఈ మేరకు వర్మ ఓ వీడియో విడుదల చేశారు.

ఊహించని రీతిలో ఈ వీడియోపై మెగాబ్రదర్ నాగబాబు స్పందించారు. వర్మకు మద్దతు పలికారు. “నువ్వు చెప్పింది అక్షరాలా నిజం… నేను ఏం అడగాలని అనుకున్నానో, ఆ ప్రశ్నలన్నీ నువ్వు అడిగావు వర్మా!” అంటూ నాగబాబు ట్వీట్ చేశారు. అంతేకాదు, వర్మ విడుదల చేసిన వీడియో తాలూకు ట్వీట్ ను కూడా తన పోస్టులో పొందుపరిచారు.

కాగా, నాగబాబు ట్వీట్ పై వర్మ స్పందించారు. “థాంక్యూ నాగబాబు గారూ… ఈ అంశంపై చిత్ర పరిశ్రమ నుంచి మరింత మంది స్పందిస్తారని ఆశిస్తున్నాను” అంటూ బదులిచ్చారు.

Related posts

సినీ ప్రముఖుల ఇళ్లలో వినాయక చవితి సందడి !

Drukpadam

ఈనెల 9 న బైరాన్ పల్లి చిత్రం ప్రపంచ వ్యాపితంగా విడుదల…

Drukpadam

జగన్ తో చిరంజీవి కీలక భేటీ …పరిస్కారం దిశగా సినీ పరిశ్రమ సమస్యలు…

Drukpadam

Leave a Comment