రాధాకు ఏదైనా జరిగితే చంద్రబాబుకే ప్రయోజనం అంటున్న కొడాలి నాని!

రాధాకు ఏదైనా జరిగితే చంద్రబాబుకే ప్రయోజనం అంటున్న కొడాలి నాని!
-రాధాకు భద్రత కల్పించాలని సీఎంను తాను అడగలేదని స్పష్టికరణ
-రెక్కీ జరిగిందనే విషయాన్ని మాత్రమే సీఎం దృష్టికి తీసుకెళ్లానని వివరణ
-చంద్రబాబు ఒక రాజకీయ వ్యభిచారి అని ధ్వజం

వంగవీటి రాధా పై రెక్కీ విషయం ఇప్పుడు ఏపీ లో హాట్ టాపిక్ గా మారింది. అసలు రెక్కీ అనేది జరగలేదని విజయవాడ పోలీస్ కమిషనర్ క్రాంతి రానా టాటా స్పష్టం చేసినప్పటికీ ఎంపీ కేశినేని నాని రెక్కీ చేసినవాళ్లు ఎవరో తెలుసునని అనడం కొత్త వివాదానికి కారణమైంది. ఇది రాధాను పరామర్శించిన అనంతరం ఆయన సమక్షంలో మీడియా తో మాట్లాడుతూ అన్నారు . అంతకుముందు మంత్రి కోడలి నాని రాధా కలిసి పాల్గొన్న ఒక కార్యక్రమంలో తనను హత్య చేయడానికి రెక్కీనిర్వహించారని రాధా వెల్లడించారు. ఈ విషయాన్నీ మంత్రి కొడాలినాని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన రాధా భద్రతా కోసం పోలీస్ ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీచేశారు. గన్ మెన్లను పంపితే రాధా తిరస్కరించారు. మంత్రి నాని రాధకు గన్ మెన్లను కేటాయించామని చెప్పినట్లు వార్తలు వచ్చాయి. దానిపై మంత్రి కోడలి నాని స్పందించారు.

తనను హత్య చేసేందుకు రెక్కీ నిర్వహించారంటూ టీడీపీ నేత వంగవీటి రాధా చేసిన వ్యాఖ్యలు కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై మంత్రి కొడాలి నాని స్పందిస్తూ… తన హత్యకు రెక్కీ జరిగిందనే విషయాన్ని రాధా తన సమక్షంలోనే చెప్పారని అన్నారు.

ఇదే విషయాన్ని తాను సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లానని తెలిపారు. దీంతో వెంటనే విచారణ జరిపించాలని, రాధాకు గన్ మెన్లతో భద్రత కల్పించాలని సీఎం ఆదేశించారని చెప్పారు. భద్రత కల్పించాలని రాధా తనను అడగలేదని, తాను కూడా ముఖ్యమంత్రిని అడగలేదని తెలిపారు.

గన్ మెన్లను తీసుకోవడం, తీసుకోకపోవడం రాధా ఇష్టమని కొడాలి నాని అన్నారు. రాధా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. రాధాకు ఏదైనా జరిగితే చంద్రబాబుకే ప్రయోజనం కలుగుతుందని చెప్పారు. పోలీసులకు సహకరించాలా, వద్దా అనే విషయం కూడా రాధా వ్యక్తిగత విషయమని అన్నారు.

తాను చంద్రబాబు మాదిరి రాజకీయ వ్యభిచారిని కాదని… అందుకే ఆయనలా నోటికి వచ్చినట్టు మాట్లాడలేనని చెప్పారు. మరోవైపు రాధా హత్యకు రెక్కీ జరిగిందని చెప్పేందుకు ప్రాథమిక ఆధారాలు లభించలేదని పోలీసులు తెలిపారు.

Leave a Reply

%d bloggers like this: