Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ప్రయాణాలపై ఆంక్షలున్నా.. 2021లో పాస్ పోర్ట్ కోసం పరుగులు…

ప్రయాణాలపై ఆంక్షలున్నా.. 2021లో పాస్ పోర్ట్ కోసం పరుగులు…

  • 2021లో 4.42 లక్షల మందికి పాస్ పోర్ట్
  • 2020లో 2.93 లక్షల మందికి
  • ఆన్ లైన్ నుంచే అపాయింట్ మెంట్ స్లాట్లు
  • హైదరాబాదు పాస్ పోర్ట్ కార్యాలయం వెల్లడి

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని పట్టి పీడిస్తుండడంతో అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై ఆంక్షలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా మన దేశం నుంచి ఇప్పటికీ పూర్తి స్థాయి సర్వీసులు నడవడం లేదు. అయితేనేమీ, పాస్ పోర్ట్ పొందేందుకు కరోనా అడ్డు కాదుగా! 2021లో హైదరాబాద్ పాస్ పోర్ట్ కార్యాలయం నుంచి భారీగానే పాస్ట్ పోర్టులు జారీ అయ్యాయి.

కరోనా వచ్చిన తొలి సంవత్సరం 2020లో 2.93 లక్షల మందికి హైదరాబాద్ ప్రాంతీయ పాస్ పోర్ట్ కార్యాలయం పాస్ పోర్ట్ లను ఇష్యూ చేసింది. ఇక 2021లో 4.42 లక్షల మంది పాస్ పోర్ట్ లు పొందారు. అయితే కరోనా రాకముందు సంవత్సరం 2019లో జారీ అయిన 5.54 లక్షల కంటే గతేడాది జారీ చేసింది కొంచెం తక్కువే.

ఈ గణాంకాలను హైదరాబాద్ రీజినల్ పాస్ పోర్ట్ అధికారి దాసరి బాలయ్య విడుదల చేశారు. అపాయింట్ మెంట్ కోసం ఆన్ లైన్ లోనే 100 శాతం స్లాట్ లను జారీ చేస్తున్నట్టు చెప్పారు. నాలుగు పాస్ పోర్ట్ సేవా కేంద్రాలు, 14 పోస్ట్ ఆఫీస్ పాస్ పోర్ట్ సేవా కేంద్రాలు, ఒక పాస్ పోర్ట్ లఘు కేంద్రం నుంచి ఈ సేవలు పొందొచ్చన్నారు. అపాయింట్ మెంట్ కోసం వేచి ఉండే కాలాన్ని తగ్గించేందుకు డిసెంబర్ లో రోజూ 200 అదనపు అపాయింట్ మెంట్ స్లాటులను విడుదల చేసినట్టు చెప్పారు.

Related posts

త్వరలో వరంగల్ జర్నలిస్టులకు ఇంటి స్థలాలు – ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్

Drukpadam

శ్రీలంకలో ఎమర్జెన్సీ ఎత్తివేత.. మరింతగా దిగజారిన పరిస్థితి…

Drukpadam

నవంబరు నుంచి వాట్సాప్ సేవలు ఈ క్రింద మొబైల్స్‌లో బంద్ కానున్నాయి!

Drukpadam

Leave a Comment