Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఖమ్మం జిల్లాలో అసాంఘిక శక్తులపై ఉక్కు పాదం ;సీపీ విష్ణు ఎస్ వారియర్!

ఖమ్మం జిల్లాలో అసాంఘిక శక్తులపై ఉక్కు పాదం ;సీపీ విష్ణు ఎస్ వారియర్
-జిల్లా వ్యాప్తంగా పోలీసుల విస్తృత తనిఖీలు
-షాపులలో ,వాహనాలు తనిఖీలు
-శాంతి భద్రతలపై రాజీలేదు ….
-మాదకద్రవ్యాలు ,నిషేదిత పొగాకు ఉత్పత్తులపై కొరడా

జిల్లాలో ఎటువంటి అసాంఘిక శక్తులకు అవకాశం లేకుండా అక్రమ రవాణా, నిషేధిత పొగాకు ఉత్పత్తులు, గంజాయి వంటి విక్రయాలకు అడ్డుకట్ట వేసేందుకు జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాలలో దుకాణాలలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.

నేరాల నియంత్రణ, ప్రజా భద్రతకు భరోసా కల్పిచేందుకు నిరంతరం తనిఖీలు కొనసాగిస్తూ ….అసాంఘిక కార్యకలాపాలపై, నేరస్తుల కదలికపై నిఘా ఉండాలన్న పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసు అధికారులు, సిబ్బంది విస్తృతంగా వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. జిల్లాలో శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం వాటిల్లకుండా, అసాంఘిక కార్యకలాపాలకు తావు లేకుండా, మాదక ద్రవ్యాలు, నిషేధిత పొగాకు ఉత్పత్తులు వంటి వాటి యొక్క అక్రమ రవాణా నిరోధించే ఉద్దేశంతో ప్రతి ఒక్క వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తూన్నారు. అనుమానిత వ్యక్తులు గాని, వాహనాలు గాని తారసపడితే వాటి గురించి పూర్తి వివరాలను సేకరించి, అనంతరం వారి ప్రయాణానికి వెసులుబాటు కల్పిస్తున్నారు. అదేవిధంగా
బైక్‌ ర్యాష్ డ్రైవింగ్, సౌండ్ పొల్యూషన్, ఈవ్ టిజింగ్,… అసాంఘీక కార్యకాలపాలతో మితి మీరిపోతున్న అకాతాయిలపై ప్రత్యేక దృష్టి సారించి చెక్ పెట్టాలని పోలీస్ కమిషనర్ సూచనలతో పోలీస్ అధికారులకు దృష్టి సారించారు.

Related posts

కృష్ణ , గోదావరి నదుల బోర్డు సమావేశం …తెలంగాణ అధికారుల గైర్హాజరు!

Drukpadam

ఆ 40 అంతస్తుల ట్విన్ టవర్లను కూల్చేయండి: సుప్రీంకోర్టు సంచలన ఆదేశం!

Drukpadam

పురుషుడిగా మారాలనుకున్న మహిళా కానిస్టేబుల్.. అనుమతి ఇచ్చిన ప్రభుత్వం…

Drukpadam

Leave a Comment