తెలంగాణ ప్రభుత్వంలో అంగన్వాడీలకు అరుదైన గౌరవం…

తెలంగాణ ప్రభుత్వంలో అంగన్వాడీలకు అరుదైన గౌరవం…
-67,411 మంది అంగన్వాడీలకు చేనేత చీరలు
-ట్రాన్స్ జెండర్లు తయారు చేసిన జూట్, చేనేత బ్యాగుల విడుదల చేసిన
-మంత్రులు కేటీఆర్, సత్యవతి రాథోడ్
-అంగన్వాడిలకు అభినందనలు, ట్రాన్స్ జెండర్లకు శుభాకాంక్షలు

తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో, యువ నాయకులు, చేనేత – జౌళీ శాఖ మంత్రి కేటీఆర్ మార్గదర్శకత్వంలో, గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ ఆధ్వర్యంలో దేశంలో అంగన్వాడీలకు మరో అరుదైన గౌరవం దక్కింది. అంగన్వాడి టీచర్లు, ఆయాలను సముచితంగా గౌరవించేందుకు ఇప్పటికే ఎక్కడా లేని విధంగా మూడు సార్లు వేతనం పెంచి, 30 శాతం పి.ఆర్.సి ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు నేతన్నలను ప్రోత్సహించడంలో భాగంగా అంగన్వాడీలకు చేనేత వస్త్రాలు అందించింది. నేడు హైదరాబాద్ లోని కేటీఆర్ క్యాంప్ కార్యాలయంలో మంత్రులు కేటిఆర్ , సత్యవతి రాథోడ్ , మహిళా, శిశు సంక్షేమ శాఖ కమిషనర్ ప్రత్యేక కార్యదర్శి దివ్య దేవ రాజన్ గారు కలిసి ఈ చేనేత చీరలను అంగన్వాడి లకు అందించారు. అనంతరం ట్రాన్స్ జెండర్లు తయారు చేసిన చేనేత – జుట్ బ్యాగులను విడుదల చేశారు.

రాష్ట్రంలోని 31,711మెయిన్ అంగన్వాడి కేంద్రాలు, 3989 మిని అంగన్వాడి కేంద్రాలలోని 67,411 మంది అంగన్వాడి టీచర్లు, ఆయాలు, మినీ అంగన్వాడీ టీచర్లకు ఈ చేనేత చీరలు అందనున్నాయని మంత్రులు తెలిపారు.

అంగన్వాడీ టీచర్లు, ఆయాలకి ఇప్పటికే రెండు జతల ప్రత్యేక చీరలు అందించడం జరిగిందన్నారు. ఇప్పుడు తాజాగా మూడో జతగా చేనేత చీరలు అందించడం సంతోషంగా ఉందన్నారు.

అంగన్వాడీ లకు గౌరవ ప్రదమైన వస్త్రాలు..సరైన వేతనాలు ఇవ్వడంతో పాటు అంగన్వాడి కేంద్రాలను పటిష్టం చేస్తున్నాం అని, ప్రి ప్రైమరీ విద్యను, పోషకాహారాన్ని అందిస్తున్నామని తెలిపారు.

అంగన్వాడీలకు అభినందనలు, ట్రాన్స్ జెండర్లకు శుభాకాంక్షలు తెలిపారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ ఐటీ, పురపాలక, పరిశ్రమల, చేనేత- హౌలి శాఖల మంత్రి కేటిఆర్ మార్గదర్శకంలో ప్రభుత్వం తమ మీద ఉన్న నమ్మకాన్ని నిలబెట్టే విధంగా పని చేస్తామని హామీ ఇస్తున్నట్లు మహిళా, శిశు సంక్షేమ శాఖ కమిషనర్, ప్రత్యేక కార్యదర్శి దివ్య దేవరాజన్ తెలిపారు.

Leave a Reply

%d bloggers like this: