Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
కోవిడ్ వార్తలు

దేశంలో ప్రమాదకర స్థాయికి కరోనా..లక్షకు పైగా కేసుల నమోదు!

దేశంలో ప్రమాదకర స్థాయికి కరోనా.. రికార్డు స్థాయిలో లక్షకు పైగా కేసుల నమోదు!

  • గత 24 గంటల్లో 1,17,100 కేసులు వెలుగులోకి
  • కొవిడ్ కారణంగా 302 మంది మృతి
  • మరణాల్లో కేరళ, కేసుల్లో పశ్చిమ బెంగాల్‌ టాప్

దేశంలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. నిన్న ఒక్కరోజులోనే రికార్డు స్థాయిలో లక్ష 17 వేల కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తుంది. దీంతో అనేక రాష్ట్రాలు ఆంక్షల దిశగా ఆడుగులు వేస్తున్నాయి. మరణాల్లో కేరళ , కేసుల్లో బెంగాల్ రాష్ట్రాలు ఇప్పుడు నెంబర్ వన్ స్థానాల్లో ఉన్నాయి. కరోనా థర్డ్ వేవ్ విజృభిస్తుందని మొదటినుంచి నిపుణులు చెబుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థకూడా వార్నింగ్ ఇచ్చింది. అయితే ఇప్పుడు వస్తున్నా వైరియంట్ ఓమిక్రాన్ అంత ప్రమాదకరమైంది కాదంటూ చెబుతుండటంతో ప్రజలు ఆంక్షలు పట్టించుకోకుండానే తిరుగుతున్నారు. దీంతో కేసులు ఎక్కువ అవుతున్నాయనే అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి.

దేశంలో శరవేగంగా వ్యాప్తి చెందుతున్న ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా కరోనా కేసులు ప్రమాదకర స్థాయిలో పెరుగుతున్నాయి. దాదాపు ఏడు నెలల తర్వాత దేశంలో తొలిసారి నేడు లక్షకు పైగా కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోలిస్తే ఇది 28.8 శాతం ఎక్కువ కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. గత 24 గంటల్లో ఏకంగా 1,17,100 కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాలు చెబుతున్నాయి.

తాజా కేసులతో కలుపుకుని మొత్తం కేసుల లోడు 3,52,26,386కు పెరిగింది. కేసులు అత్యధికంగా నమోదైన ఐదు రాష్ట్రాల్లో మహారాష్ట్ర (36,265) అగ్రస్థానంలో ఉండగా, ఆ తర్వాతి స్థానాల్లో పశ్చిమ బెంగాల్ (15,421), ఢిల్లీ (15,097), తమిళనాడు (6,983), కర్ణాటక (5,031) రాష్ట్రాలు ఉన్నాయి.

అలాగే, గత 24 గంటల్లో 302 కరోనా మరణాలు సంభవించాయి. వీటితో కలుపుకుని ఇప్పటి వరకు కొవిడ్‌తో మరణించిన వారి సంఖ్య 4,83,178కి పెరిగింది. తాజా మరణాల్లో అత్యధికంగా కేరళలో 221 కేసులు నమోదు కాగా, పశ్చిమ బెంగాల్‌లో 19 మంది మరణించారు. ఇక, రికవరీ రేటు 97.57 శాతంగా ఉండడం ఊరటనిచ్చే విషయం.

Related posts

ఆసుపత్రిలో కరోనా పేషెంట్ మృతి.. డాక్టర్లను చితకబాదిన బంధువులు!

Drukpadam

దేశంలో ప్రతి ఒక్కరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్ … ప్రధాని మోడీ

Drukpadam

ఢిల్లీ, మ‌హారాష్ట్ర‌లో స‌డ‌లింపులు .. భారీగా రోడ్ల‌పైకి వ‌చ్చిన జ‌నాలు..

Drukpadam

Leave a Comment