కేరళ సీఎం విజయన్ సిపిఎం అగ్రనేతలు ఏచూరి ,కారత్ లు సీఎం కేసీఆర్ తో భేటీ !

కేరళ సీఎం విజయన్ సిపిఎం అగ్రనేతలు ఏచూరి ,కారత్ లు సీఎం కేసీఆర్ తో భేటీ !

హైదరాబాద్ ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ తో కేరళ ముఖ్యమంత్రి విజయన్ భేటీ
హైదరాబాదులో సీపీఎం సమావేశాలు
నగరానికి వచ్చిన కేరళ సీఎం పినరయి విజయన్
విజయన్ ను లంచ్ కు ఆహ్వానించిన సీఎం కేసీఆర్
విజయన్ వెంట సీతారాం ఏచూరి, ప్రకాశ్ కారత్

కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ హైదరాబాద్ విచ్చేశారు. సీపీఎం కేంద్ర కమిటీ సమావేశాలు నగరంలోనే జరుగుతున్నాయి. ఈ సమావేశాల్లో సీఎం విజయన్ కూడా పాల్గొంటున్నారు. కాగా, నగరానికి వచ్చిన కేరళ సీఎంను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మర్యాదపూర్వకంగా మధ్యాహ్న భోజనానికి ఆహ్వానించారు. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ ను పినరయి విజయన్ ప్రగతి భవన్ లో కలిశారు. కాగా, విజయన్ వెంట సీతారాం ఏచూరి (సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి), సీపీఎం అగ్రనేత ప్రకాశ్ కారత్ కూడా ఉన్నారు.

వీరి మధ్య జాతీయ రాజకీయాలు కేంద్ర రాష్ట్ర సంబంధాలపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ధాన్యం కొనుగోలు విషయంలో కేసీఆర్ బీజేపీ పై యుద్ధం ప్రకటించిన నేపథ్యంలో వీరి భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది.కేసీఆర్ ఇప్పటికి బీజేపీకి అనుకూలంగా ఉంటారా ? లేక ప్లేట్ మార్చుతారా ? అనేసందేహాల నడమ సిపిఎం నేతలతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకున్నది . విజయం తో పాటు సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి , పోలిబ్యూరో సభ్యుడు ప్రకాష్ కారత్ కూడా సీఎం కేసీఆర్ తో భేటీలో పాల్గొన్నారు. బీజేపీ ని అధికారంలోకి రాకుండా చేసేందుకు సిపిఎం మొదటినుంచి ప్రయత్నాలు చేస్తూనే ఉంది. అందువల్ల బీజేపీకి ప్రత్యాన్మాయం పై కూడా వారు చర్చల్లో వచ్చింది. దేశ రాజకీయాల్లో తాజా పరిణామాలు వివిధ రాష్ట్రాల్లో బీజేపీ వ్యతిరే శక్తులు వారి ప్రాధాన్యతలు కూడా వారి చర్చించారని తెలుస్తుంది.

Leave a Reply

%d bloggers like this: