Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

తెలంగాణ రాజకీయాల్లో నూతన పరిణామం!లెఫ్ట్ నేతలతో సీఎం కేసీఆర్ భేటీ !!

తెలంగాణ రాజకీయాల్లో నూతన పరిణామం!లెఫ్ట్ నేతలతో సీఎం కేసీఆర్ భేటీ !!
-సీఎం కేసీఆర్ వామపక్షాలతో వరస భేటీలు
-తొలుత సిపిఎం ,అనంతరం సిపిఐ అగ్రనేతలతో భేటీ
-ఒకరితో లంచ్ , మరొకరితో టీ పార్టీ… సీఎం బిజీ బిజీ
-దేశరాజకీయాలు చూపు ఒక్కసారిగా తెలంగాణ వైపు

తెలంగాణ రాజకీయాల్లో నేడు నూతనపరిణామాలు చోటుచేసుకున్నాయి. బీజేపీ తో కేసీఆర్ ధాన్యం కొనుగోలు విషయంలో యుద్ధం చేస్తున్న ప్రస్తుత తరుణంలో సిపిఐ సిపిఎం పార్టీలకు చెందిన జాతీయనేతలతో సీఎం కేసీఆర్ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకున్నది . సిపిఎం నేతలతో సీఎం కేసీఆర్ లంచ్ మీటింగ్ జరగ్గా ,సిపిఐ నేతలతో టీ పార్టీ మీటింగ్ నిర్వహించారు. ఒకప్పుడు వామపక్షాల అవి ఎక్కడ ఉన్నాయని ఎద్దేవా చేసిన కేసీఆర్ వారిని స్వయంగా పిలవడం వారితో చర్చలు జరపడం ఆశక్తిగా మారింది. దీంతో ఒక్కసారిగా దేశ రాజకీయాల చూపు హైద్రాబాద్ వైపు మళ్లింది. అక్కడ ఏమి జరుగుతుంది అనే చర్చలు ప్రారంభంమైయ్యాయి.

దేశరాజకీయాల్లో ఒకప్పుడు చక్రం తిప్పిన సిపిఎం ,సిపిఐ పార్టీలు మారిన రాజకీయ పరిస్థితుల్లో కొంత వెనకపట్టు పట్టాయి, బలహీనపడ్డాయి. వామపక్షాల బలం పార్లమెంట్ లో తగ్గింది. గతంలో అధికారంలో ఉన్న తిరుగులేని శక్తిగా ఉన్న బెంగాల్, త్రిపుర రాష్ట్రాల్లో అధికారాన్ని కోల్పాయాయి. ప్రజా ఉద్యమాలకు ఈపరిణామాలు గొడ్డలిపెట్టుగా మారింది. లౌకిక పార్టీలు చెప్పుకుంటున్న టీఆర్ యస్ పార్టీ కూడా తన అవసరాలకోసం కేంద్రంలోని బీజేపీ చేస్తున్న చట్టాలను సమర్థిస్తూ వచ్చింది. దీంతో రాష్ట్రంలో టీఆర్ యస్ పట్ల కూడా ప్రజల్లో వ్యతిరేకత ప్రారంభమైంది. దీనికి తోడు రాష్ట్రాల అధికారాల విషయంలో కేంద్రంలోని బీజేపీ ఇబ్బందులకు గురిచేస్తుంది. రాష్ట్రాలను తమ సామంత రాజ్యాలుగా భావిస్తూ చెప్పు చేతుల్లో ఉంచుకునేందుకు చూస్తుంది . అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్ర విధానాలపట్ల విసుగు చెందారు. ప్రధానంగా బీజేపీయేతర రాష్ట్రాలపట్ల సవతి తల్లి ప్రేమ కనబరుస్తుంది. కేంద్ర వైఖరిపై రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆగ్రహంగా ఉన్నారనేది అనేక సందర్బాల్లో వారి మాటలను భట్టి అర్థం అవుతుంది. కేంద్ర వైఖరిపై ఒకసందర్భంలో ఏపీ సీఎం జగన్ , మరో సందర్భంలో తమిళనాడు సీఎం స్టాలిన్ బీజేపీయేతర రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖలు రాశారు . ఇక కేసీఆర్ అనేక సందర్భాలలో కేంద్రం పై కారాలు మిరియాలు నూరుతూ వెంటనే సరెండర్ అవుతున్నారనే విమర్శలు మూటగట్టుకున్నారు .

ఇప్పుడు తెలంగాణాలో బీజేపీ అధికారంలోకి రావాలని ఎత్తులు వేస్తుంది. దీంతో ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రం కేసీఆర్ సర్కారు మధ్య తేడాలు వచ్చాయి. దాదాపు కేంద్రంపై సైఅంటే సై అంటూ కాలుదువ్వుతున్నారు. అయితే కేంద్రంపై యుద్ధం చేయాలంటే ప్రస్తుతం కేసీఆర్ ఒక్కడి బలం సరిపోదు … దేశవ్యాపితంగా సంబంధాలు కలిగివుండి నిరంతరం ప్రజలకోసమే ఉద్యమాలు చేస్తున్న వామపక్షాల మద్దతు లేకుండా బీజేపీని ఎదుర్కోవడం కష్టం అని భావించిన తెలంగాణ సీఎం కేసీఆర్ వారితో మాట్లాడని నిర్ణయించుకున్నారు. దీంతో సిపిఎం కేంద్రకమిటీ సమావేశాల్లో పాల్గొనేందుకు హైద్రాబాద్ వచ్చిన కేరళ సీఎం పినరాయ్ విజయన్ , సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి , పొలిట్ బ్యూరో సభ్యులు ప్రకాష్ కారత్ , బృంద కారత్ , త్రిపుర మాజీ సీఎం మాణిక్ సర్కార్ లను లంచ్ కు పిలిచారు . మధ్యాహ్నం సిపిఐ ప్రధాన కార్యదర్శి , రాజా , నాయకులు అతుల్ కుమార్ అంజన్, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, కూనంనేని సాంబశివరావు , పల్లా వెంకటరెడ్డి తదితరులతో టీ సమావేశం నిర్వహించారు కేసీఆర్ ఈ రెండు పార్టీలతో దేశరాజకీయాలు గురించి చర్చించారు. రోజురోజుకు మారుతున్న రాజకీయాలు కేంద్రం లో బీజేపీ పట్ల ప్రజల్లో భ్రమలు తొలిగేలా చేశాయని వారు అభిప్రాయపడ్డారు .

రాష్ట్రాలపట్ల చిన్నచూపు చూస్తూ మతకలహాలు , ప్రాంతీయ కలహాలు ప్రోత్సహిస్తూ తిరిగి కేంద్రంలో అధికారంలోకి రావాలని చూస్తున్న బీజేపీని నిలువరించేందుకు ఏమి చేయాలనే సమాలోచనలు విపక్షాలతో కేసీఆర్ చేసారు. ఇలాంటి సమావేశాలు మరిన్ని జరగాలని వామపక్ష నేతలు కేసీఆర్ కు సూచించినట్లు సమాచారం చూద్దాం ఏమిజరుగుతుందో మరి !

Related posts

సిద్దుకే సీఎం కూర్చినా…? నిరాశలో డీకే శివకుమార్

Drukpadam

సిమెంట్ రేటు తగ్గించరు కానీ, సినిమా టికెట్ల ధరలు తగ్గిస్తారట!: చంద్రబాబు వ్యంగ్యం!

Drukpadam

ఎమ్మెల్సీ స్థానానికి పార్టీ అవకాశం ఇస్తే పోటికి సిద్ధం:కాంగ్రెస్ నేత శ్రీనివాస్ యాదవ్

Drukpadam

Leave a Comment