మాస్క్ లు లేకుండా తిరుతుతున్న మహిళలు …మాస్క్ లు ఇచ్చిన మంత్రి …

మాస్క్ లు లేకుండా తిరుతుతున్న మహిళలు …మాస్క్ లు ఇచ్చిన మంత్రి …
హైదరాబాదు చైతన్యపురిలో మాస్కుల్లేకుండా కనిపించిన మహిళలు
ఓ ప్రైవేటు ఆసుపత్రి ప్రారంభోత్సవానికి వచ్చిన హరీశ్
మంత్రి రాకతో సందడి
మాస్కుల్లేకుండా కనిపించిన మహిళలు
తన వద్ద ఉన్న మాస్కులు అందజేసిన హరీశ్

కరోనా కరాళనృత్యం చేసిందని దానివల్ల ప్రాణాలుకూడా పోగొట్టుకుంటున్నారని ప్రపంచం అంట కోడై కూస్తున్నవేళ ఆరోగ్యమంత్రి హరీష్ రావు కార్యక్రమానికి హాజరైన మహిళలు మాస్క్ లు లేకుండా రావడం గమనించిన హరీష్ రావు వారిని పిలిచి కరోనా గురించి చెప్పి మాస్క్ లు అందజేసిన ఘటన హైదరాబాలో చోటు చేసుకుంది .దీంతో అక్కడ ఉన్నవారంతా అవాక్కుఆయ్యారు . హరీష్ రావు ఉన్నంతసేపు అక్కడ మాస్క్ లేకుండా ఏ ఒక్కరు కనిపించలేదు. పైగా ఇకనుంచి తాము మాస్క్ లేకుండా బయటకు రాబోమని మంత్రికి చెప్పారు. ఆయన కూడా అందరు తప్పకుండ మాస్క్ లు ధరించాలని అప్పడే మన ఆరోగ్యం తోపాటు ఎదుటి వారు ఆరోగ్యాన్ని కాపాడినవారమౌతామని చెప్పారు.

తెలంగాణ మంత్రి తన్నీరు హరీశ్ రావు ఇవాళ హైదరాబాదు చైతన్యపురిలో ఓ ప్రైవేటు ఆసుపత్రి ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. మంత్రి రాక నేపథ్యంలో అక్కడ సందడి వాతావరణం నెలకొంది. అయితే, హరీశ్ రావు కారు నుంచి దిగగానే పలువురు మహిళలు మాస్కుల్లేకుండా దర్శనమిచ్చారు. దాంతో ఆయన తన వద్ద ఉన్న మాస్కులను వారికి అందించారు. బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించడం తప్పనిసరి అని, కొవిడ్ పట్ల నిర్లక్ష్యంగా ఉండరాదని ఆయన వారికి హితవు పలికారు.

కాగా, హరీశ్ రావు అక్కడున్నంతసేపు మాస్కుల్లేకుండా ఎవరైనా కనిపిస్తే వారికి మాస్కు అందించారు. అంతేకాదు, వారితో ఆప్యాయంగా మాట్లాడి సంతోషానికి గురిచేశారు.

Leave a Reply

%d bloggers like this: