వనమా వెంకటేశ్వరరావు రాజీనామాకు సిద్దపడుతున్నారా…?

వనమా వెంకటేశ్వరరావు రాజీనామాకు సిద్దపడుతున్నారా…?
కొడుకు రాఘవ దెబ్బకి వనమా రాజకీయ సమాధి కానున్నారా ?
వనమా కుటుంబానికి రాజకీయం చరమగీతమేనా ?
కొడుకు దురాగతాలతో చెడ్డపేరు మూటగట్టుకున్న వనమా ఏమి చేయబోతున్నారు
రాఘవ అరాచకాలపై ఇన్నాళ్లు ప్రజలు ఎందుకు మౌనంగా ఉన్నారు
గత 10 సంవత్సరాలుగా కేసులు పెండింగ్ లో ఉండటమా?

వనమా వెంకటేశ్వరరావు సీనియర్ రాజకీయనేత మొదటినుంచి కాంగ్రెస్ ఫ్యామిలీ …. కాంగ్రెస్ నుంచి గెలిచి అధికార టీఆర్ యస్ లోకి జంప్ అయినా ఎమ్మెల్యేల్లో ఈయన ఒకరు …ఇప్పుడు అయన పేరు రాష్ట్రవ్యాపితంగా మరోమోగింది …. కొడుకు రాఘవ నిర్వాహకం వల్ల కుమిలి పోతున్న ఆయన రాజీనామా చేయబోతున్నారా ? అంటే అవును ఆ ఆలోచనలో ఉన్నాడని ప్రచారం జరుగుతుంది. ఇందులో నిజమెంత ఉన్నప్పటికీ ఆయన 50 సంవత్సరాల రాజకీయ జీవితంలో రాఘవ వల్ల పెద్ద మచ్చ పడింది. వయసులో పెద్దయన … నాలుగుసార్లు కొత్తగూడం నుంచి ఎమ్మెల్యే గా ఎన్నికైన భోలాశంకరుడుడు …కొడుకు ఎన్ని అరాచకాలు చేసిన వనమా వెంకటేశ్వరరావు కు ప్రజల్లో ఉన్న సానుకూలత ఆయన్ను గెలిపించింది. అనేక సార్లు వనమా ను నీ కొడుకు వల్ల చెడ్డపేరు మూటగట్టుకుంటున్నారని అనేక మంది హెచ్చరించారు. మీడియా సహితం అనేక సార్లు కోడై కూసింది. అయితే వనమాకు ఉన్న బలం …బలహీనత కూడా ఆయన కుమారుడు రాఘవనే కావడంతో అన్నిటిని భరిస్తూ వస్తున్నాడు . ఎన్నికల వ్యూహరచనలో రాఘవ పెద్ద దిట్ట …తిమ్మిని బొమ్మిని చేయగల సమర్థుడు …. ఎన్నికల సందర్భంలో అక్కడ అన్ని తానై వ్యవహరిస్తుంటారు రాఘవ ….. రాఘవ కు పెద్ద గ్యాంగ్ ఉంది…కొత్తగూడెం ,పాల్వంచలు రెండు పారిశ్రామిక ప్రాంతాలు అందువల్ల ఎక్కడనుంచో అక్కడకు అనేకమంది ఉద్యోగాలకోసం వస్తారు . కొత్తగా వచ్చిన వారు ఎవరినో ఒకరిని ఆశ్రయించక తప్పదు దీన్ని తనకు అనుకూలంగా మార్చుకుంటాడు రాఘవ …

ఎవరు ఏది చేయాలన్న వనమా కుటుంబం కనుసన్నల్లో జరగాల్సిందే …అదే వీరికి ఆదాయవనరుగా మారింది. వందల కోట్లు సంపాదించారని జోనంనోట మాట . అందువల్ల కుటుంబ తగాదాలతోపాటు షటిల్ మెంట్లు పెద్ద డీల్స్ బదిలీలు ,అన్ని వీరు ఆమోదం మేరకే జరగాలి .ఇక పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు కావాలన్నా ఎమ్మెల్యేగా ఉన్న వనమా వెంకటేశ్వర రావు తనయుడు రాఘవ అనుమతి తప్పనిసరి …దీంతో పోలీస్ స్టేషన్ కు వెళ్లిన కేసులు వీరిదగ్గర షటిల్ చేసుకోవాల్సిందే …ఒకరకంగా చెప్పాలంటే ఇల్లీగల్ ను లీగల్ చేయడం ,లీగల్ ను ఇల్లీగల్ చేయడం అంటే రాఘవకు మహాసరదా అని అక్కడ ప్రజలు చెప్పుకుంటున్నారు .దీనికి పెద్ద మొత్తంలో సమర్పించుకోవాల్సిందే . వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో పని కావాలన్నా పని ఆగాలన్న రాఘవ చెప్పాల్సిందే . పాల్వంచ కొత్తగూడెంలలో రాజ్యాంగేతర శక్తిగా ఎదిగిన రాఘవ చేయని నేరాలు ,ఘోరాలు లేవని టాక్ . వివాహేతర సంబంధాలు చాలానే ఉన్నాయని విమర్శలు ఉన్నాయి.అసలు వనమా ఆగడాలపై ఒక విచారం సంఘాన్ని వేయాలని , లేదా ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని వేర్పాటు చేయాలనీ ప్రజలు,ప్రజాసంఘాలు , వివిధ రాజకీయపార్టీలు కోరుకుంటున్నాయి. దీనిపై ప్రభుత్వం సీరియస్ గా ఆలోచిస్తే దానికి మంచి పేరు వస్తుందనే అభిప్రాయాలు ఉన్నాయి. లేకపోతె రాఘవ ఆగడాలకు వత్తాసు పలుకు తున్నారనే అభిప్రాయాలు ప్రభుత్వం ముఠా కట్టుకోకతప్పదు …

విమర్శలకు దారితీస్తున్న పోలీస్ అధికారుల బదిలీలపై ఎమ్మెల్యేల సిఫార్స్ లేఖలు

పోలీస్ అధికారుల బదిలీల విషయంలో ప్రభుత్వ విధానం విమర్శలకు దారితీస్తుంది. అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఎమ్మెల్యే అనుమతి ఉంటేనే అక్కడకు పోలీస్ అధికారుల పోస్టింగ్ అనేది ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తుంది. ఎమ్మెల్యే లెటర్ ఉంటె తప్ప ఎసిపి స్థాయి అధికారి రావడంలేదని అందువల్ల లెటర్ దగ్గరనుంచే ఎమ్మెల్యే ప్రాపకంకోసం పాకులాడే పోలీస్ అధికారి ఆ ఎమ్మెల్యే చెప్పినట్లు చచ్చినట్లు వినాల్సి వస్తుంది. దీంతో ప్రజల్లో చెడ్డపేరును ఇటు ప్రభుత్వం అటు పోలీసులు అధికారులు మూట గట్టుకుంటున్నారు. వారి పైఅధికారులకు జవాబుదారిగా ఉండాల్సిన పోలీసులు ఎమ్మెల్యే చుట్టూ తిరుగుతూ వారు చెప్పినట్లు నడుచుకుంటున్నారు. ఇక్కడే అసలు ట్వీస్ట్ ఉంది. ఇది వనమా రాఘవ లాంటి వారికీ వరంగా మారింది. ఒక్క వనమా రాఘవనే కాదు అనేక మంది ఎమ్మెల్యేలు పోలీస్ అధికారులను తమ చెప్పుచేతుల్లో ఉంచుకున్నటున్నారనే విమర్శలు ఉన్నాయి. ప్రభుత్వ పెద్దలారా తస్మాత్ జాగ్రత్త ఇది మీకు పెద్ద మైనస్ కాబోతున్నది అనేది గమనించండి !

Leave a Reply

%d bloggers like this: