Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

తెలంగాణాలో 317 జి ఓ ప్రభుత్వ ఉద్యోగులకు ఉరి తాళ్లుగా మారింది!

తెలంగాణాలో 317 జి ఓ!  ప్రభుత్వ ఉద్యోగులకు ఉరి తాళ్లుగా  మారింది!
ఇంట్లోనే దీక్ష చేస్తున్న ఉద్యోగ భార్యాభర్తలు
పలుపార్టీలు ప్రజాసంఘాలు మద్దతు
ఇది అన్యాయం అంటున్న ఉద్యోగులు

ఖమ్మం

ఉద్యోగుల విభజన జీఓ 317 తమ కుటుంబాన్ని ఉద్యోగ రీత్యా దూర ప్రాంతాలకు నెట్టివేసిందని , ఖమ్మంలో ఉప గణాంక అధికారి ( డిప్యూటీ స్టాటిస్టికల్ ఆఫీసర్ ) కొల్లి తిరుపతిరావు మరియు గవర్నమెంట్ టీచర్ వారి సతీమణి ఇంట్లోనే దీక్ష చేస్తూ గత 6 రోజులు గా నిరసను తెలుపుతున్నారు . కాళేశ్వరం జోన్లు కేటాయించగా పెద్దపల్లి జిల్లాకు పోస్టింగ్ ఇచ్చారని , ఉపాధ్యాయురాలైన వారి సతీమణికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మల్లెల మడుగు లో పోస్టింగ్ ఇచ్చారు . ఈ క్రమంలో తిరుపతిరావు భార్యాభర్తల కేసు కింద దరఖాస్తు చేసుకోగా సమస్య పరిష్కరిస్తామని తొలుత అధికారులు హామీనిచ్చారని , తర్వాత ప్రభుత్వం పరిధిలో ఉందని వదిలేశారని తెలిపారు . సీపీఓ పరిధిలోని ఖమ్మం జిల్లాలో 8 పోస్టులు ఉండగా , ఏడుగురు ఇతర జిల్లాల నుంచి వస్తుండగా, తనకు ఆ ఒక్క పోస్టును కేటాయించాలని 6వ రోజు నిరాహార దీక్ష చేస్తున్న శ్రీమతి గుండ్ల చైతన్య స్కూల్ అసిస్టెంట్ ముదిగొండ మండలం , మేడేపల్లి ఇంగ్లీష్ టీచర్ ని భద్రాద్రి జిల్లా అశ్వాపురం మండల మల్లెల మడుగు గ్రామానికి పంపించారని , ఖాళీ ఉన్నప్పటికీ భార్యాభర్తల కేటగిరీ లో ఇవ్వటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు . దీక్ష చేస్తున్న వీరికి వైఎస్సార్ టీపీ కో – ఆర్డినేటర్ తుంపాల కృష్ణమోహన్ వైస్సార్ తెలంగాణ పార్టీ తరుపున వైఎస్ షర్మిల ఆదేశానుసారం పూర్తి మద్దతు తెలియచేస్తూ ఉద్యోగులకు శాపం గా మారిన ఈ 317 జి ఓ వెంటనే రద్దు చెయ్యాలని అలాగే ఉద్యోగుల మనోభీష్టం మేరకు కొత్త జి ఓ ను తీసుకు రావాలని కోరారు . ఎవరారైతే తెలంగాణ ఉద్యమాన్ని ఉదృతం చేసారో వాళ్లనే ఎప్పుడు ప్రభుత్వం లక్ష్యంగా చేసుకొని యుద్ధం ప్రకటించిందని ఇప్పటికైనా ప్రభుత్వం మారి ప్రజా ఆమోదమైన పరిపాలన అందించాలని లేనిపక్షంలో రానున్న ఎన్నికల్లో ప్రజాగ్రహం చూడవలసిన వస్తుందని హెచ్చరించారు . ప్రభుత్వ చర్యలు భార్యాభర్తలు అయినా ఉద్యోగులకు ఇబ్బందులు తెచ్చి పెట్టాయని స్వరాష్ట్రంలో భర్త ఒకచోట ,భార్య మరోచోట ఉద్యోగం చేయాల్సిన పరిస్థితి వచిదని అందుకేనా తెలంగాణ అని వారు ప్రశ్నించారు. పలువురు ఉద్యోగులు కూడా వీరు చేస్తున్న దీక్షకు మద్దతు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఆలస్యం సుధాకర్ , మర్రి శ్రీను , మురళి , ప్రదీప్ , కోట గాంధి , రజని ఇంకా పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు .

Related posts

న్యూస్ ఇన్ బ్రీఫ్….

Drukpadam

ఆరేళ్ల వయసులోనే లైంగిక వేధింపులకు గురయ్యా: పథనంథిట్ట కలెక్టర్ దివ్య

Drukpadam

ఆఫ్రికాలో ప్రాణాంతక మార్బర్గ్ వైరస్.. 100 మందిలో 88 మంది చనిపోయే అవకాశం…

Drukpadam

Leave a Comment