పిన్నెల్లి ఖబర్దార్…టీడీపీ నేత చంద్రయ్య హత్యపై చంద్రబాబు ఆగ్రహం!

పిన్నెల్లి రామకృష్ణారెడ్డీ… నీలాంటి వాళ్లను చాలామందిని చూశాం: చంద్రబాబు
మాచర్ల నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్త హత్య
వైసీపీ నేతలపై చంద్రబాబు ఫైర్
కార్యకర్త అంత్యక్రియలకు హాజరైన చంద్రబాబు
మాచర్ల మీ జాగీరా అంటూ పిన్నెల్లిపై ఆగ్రహం
హత్యకు గురైన టీడీపీ కార్యకర్త పాడె మోసిన చంద్రబాబు
గుండ్లపాడు గ్రామ టీడీపీ అధ్యక్షుడు చంద్రయ్య మృతి
తీవ్రంగా ఖండించిన చంద్రబాబు
చంద్రయ్య కుటుంబానికి పరామర్శ

గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో హత్యకు గురైన టీడీపీ కార్యకర్త తోట చంద్రయ్య అంత్యక్రియలకు పార్టీ అధినేత చంద్రబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా వైసీపీ నేతలపై నిప్పులు చెరిగారు. మనందరి ప్రాణాలు ఒకటేనని తెలుసుకోవాలని అన్నారు.

“మీరో పార్టీకి, మేమో పార్టీకి పనిచేస్తున్నాం. అధికారం ఎవరికీ శాశ్వతం కాదన్న విషయం తెలుసుకోవాలి. చంద్రయ్యను నడిరోడ్డుపై కిరాతకంగా హత్య చేశారు” అంటూ ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. “రౌడీలు అందరూ జాగ్రత్తగా ఉండాలి… ఖబడ్దార్!” అంటూ హెచ్చరించారు. ఒక్క చంద్రయ్యను చంపితే వందమంది తయారవుతారని స్పష్టం చేశారు. పల్నాడులోని ముఠాలను అణచివేసింది తానేనని, కానీ ఇప్పుడు చంద్రయ్య హత్యపై సీఎం జగన్ జవాబు చెప్పాలని ప్రశ్నించారు.

“పిన్నెల్లి రామకృష్ణారెడ్డీ… నీలాంటి వాళ్లను చాలామందిని చూశాం. మాచర్ల మీ జాగీరు అనుకుంటున్నారేమో… ఖబడ్దార్! మా నేతలపై దాడి చేసిన రౌడీకి మున్సిపల్ చైర్మన్ పదవి ఇస్తావా? పిన్నెల్లి సామ్రాజ్యంలో ప్రజాస్వామ్య స్థాపనకు వచ్చా. ఇక తప్పు చేయాలంటే భయపడాలి” అంటూ తీవ్రస్వరంతో వ్యాఖ్యానించారు.

హత్యకు గురైన టీడీపీ కార్యకర్త పాడె మోసిన చంద్రబాబు

గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గంలోని గుండ్లపాడు గ్రామ టీడీపీ అధ్యక్షుడు తోట చంద్రయ్య హత్యకు గురికావడం పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు దిగ్భ్రాంతికి గురయ్యారు. తమ క్యాడర్ ను భయాందోళనలకు గురిచేసేందుకు వైసీపీ రౌడీమూకలే ఈ ఘాతుకానికి పాల్పడ్డాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఆయన వెల్దుర్తి మండలం గుండ్లపాడు వెళ్లారు. చంద్రయ్య మృతదేహానికి నివాళులు అర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు. అంతేకాదు, చంద్రయ్య అంతిమయాత్రలో టీడీపీ అధినేత చంద్రబాబు పాడె మోశారు. కాగా, చంద్రబాబు రాక నేపథ్యంలో గుండ్లపాడులో టీడీపీ శ్రేణులు భారీగా తరలి వచ్చాయి.

 

Leave a Reply

%d bloggers like this: