ఏపీ సీఎం జగన్‌తో మెగాస్టార్ చిరంజీవి లంచ్ మీట్!

ఏపీ సీఎం జగన్‌తో మెగాస్టార్ చిరంజీవి లంచ్ మీట్!
-సినిమా టికెట్ల వివాదంపై చర్చించే అవకాశం!
-ఖరారైన సీఎం జగన్ అపాయింట్‌మెంట్
-సినిమా టికెట్ల వివాదానికి ఫుల్‌స్టాప్ పెట్టాలని చిరు నిర్ణయం
-ఈ భేటీ తర్వాత సమస్య పరిష్కారమవుతుందంటున్న టాలీవుడ్ వర్గాలు

సినీ ఇండస్ట్రీ కి ఏపీ ప్రభుత్వానికి మధ్య నెలకొన్న సినిమా టికెట్స్ రేట్ల వ్యవహారం పై మెగాస్టార్ చిరంజీవి రంగంలోకి దిగారు. సీఎం జగన్ మోహన్ రెడ్డిని కలిసేందుకు ఆయన హైద్రాబాద్ నుంచి గన్నవరం విమాశ్రయానికి చేరుకొని నేరుగా తాడేపల్లిలోని సీఎం నివాసానికి చేరుకుంటారు . చిరంజీవి సీఎం జగన్ కలిసేందుకు అపాయింట్మెంట్ కోరారు . చిరంజీవిని కలిసేందుకు అంగీకరించిన జగన్ కలిసి లంచ్ చేద్దామని అప్పుడే అన్ని విషయాలు చర్చించుకుందామని ఆహ్వానించినట్లు సమాచారం . అయితే ఒక్క చిరంజీవే కలుస్తారా ? ఇంకెవరైనా చిరంజీవితో కలిసి వస్తారా ? అనేదే ఇంకా వెల్లడి కాలేదు .చిరంజీవి కలిసిన తరువాత సినిమా టికెట్స్ ధరలపై ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

మెగాస్టార్ చిరంజీవి ఈ మధ్యాహ్నం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలవనున్నారు. ఈ మేరకు సీఎం అపాయింట్‌మెంట్ ఖరారైంది. ఇద్దరూ కలిసి మధ్యాహ్నం లంచ్ చేయనున్నట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా సినిమా టికెట్ల వివాదంపై చర్చించే అవకాశం ఉందని చెబుతున్నారు.

సినిమా టికెట్ల వివాదం రోజురోజుకు ముదురుతున్న నేపథ్యంలో దీనికి ఫుల్‌స్టాప్ పెట్టాలని చిరంజీవి భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జగన్‌ అపాయింట్‌మెంట్ కోరారని చెబుతున్నారు. జగన్-చిరంజీవి భేటీ తర్వాత సినిమా టికెట్ల వివాదం ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.

Leave a Reply

%d bloggers like this: