Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

నకిలీ సర్టిఫికెట్లతో విధ్యార్థులను విదేశాలకు తరలిస్తున్న ఇద్దరు నిందితుల అరెస్టు!

నకిలీ సర్టిఫికెట్లతో విధ్యార్థులను విదేశాలకు తరలిస్తున్న ఇద్దరు నిందితుల అరెస్టు!

గుర్తింపు కలిగిన వివిధ విశ్వ విద్యాలయాలకు సంబంధించిన నకిలీ సర్టిఫికెట్లను తయారుచేసి వాటి ద్వారా విద్యార్థులను విదేశాలకు తరలిస్తున్న ఇద్దరు నిందితులను గురువారం వరంగల్ కమిషనరేట్ టాస్క్ఫర్స్ పోలీసులు కేయూసి మరియు హన్మకొండ పోలీసులు సంయుక్తంగా అరెస్టు చేయగా మరో ముగ్గురు నిందితులు ప్రస్తుతం పరారీలో వున్నారు.

ఈ ఇద్దరి నిందితుల నుండి వివిధ విశ్వవిద్యాలయాలకు సంబంధించి 22 నకిలీ సర్టిఫికెట్లు, 1ల్యాప్టాన్లు , 3 ప్రింటర్లు, 5 సిపియూలు, 3 సెల్‌ఫోన్ల పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

పోలీసులు అరెస్టు చేసిన నిందితుల వివరాలు:
1.గొల్లపల్లి రాజేంద్ర ప్రసాద్, తండ్రి పేరు సాంబయ్య, వయస్సు 40, నయీంనగర్, హన్మకొండ జిల్లా. 2.వెలన నరేష్ రావు, తండ్రి లక్ష్మన్ రావు, వయస్సు 29, ఎల్.బి నగర్, హైదరాబాద్.

ప్రస్తుతం పరారీలో వున్న నిందితులు: ఖాజా నయీముద్దీన్, శ్రీకాంత్ రెడ్డి, కలికోట తిరుపతి వున్నారు.

ఈ అరెస్టుకు సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనర్ డా.తరుణ్ జోషి వివరాలను వెల్లడిస్తూ పోలీసులు అరెస్టు నిందితులు హన్మకొండ, హైదరాబాద్ నగరాల్లో కన్సల్టెన్సీ సంస్థలు నిర్వహిస్తున్నారు. ఈ సంస్థల ద్వారా వచ్చే ఆదాయం తన జీవనానికి సరిపోకపోవడంతో పాటు పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించుకోవాలనికున్నారు. ఇందులో భాగంగా నిందితులిద్దరు విదేశాల్లో విద్య అభ్యసించాలనుకునే వ్యక్తులు, విద్యార్థులకు ఎలాంటి విద్యార్హతలు లేకున్నా తమకు కావల్సిన విద్యాసంస్థలకు సంబంధించిన సర్టిఫికెట్లను ప్రస్తుతం పరారీలో వున్న శ్రీకాంత్ రెడ్డి ద్వారా నిందితులు నకిలీ సర్టిఫికెట్లను సమకూర్చుకోనేవారు. ఈ నకిలీ సర్టిఫికేట్ ను వినియోగించుకోని నిందితులిద్దరు తమ కన్సల్టెన్సీ సంస్థల ద్వారా విద్యార్థులను ఎలాంటి విద్యార్హత లేకున్న విదేశాలకు వెళ్ళేందుకు మార్గం సులభం చేసేవారు.
అదే విధంగా ఈ నకిలీ సర్టిఫికెట్ల తయారు చేసే ఈ ముఠా మరో అడుగు ముందుకేసి కొన్ని విదేశాల్లోని విద్యాలయాల్లో అడ్మిషన్ పొందేందుకుగాను కనీస మార్కుల శాతాన్ని తప్పనిసరి చేయడంతో కొద్ది మంది విద్యార్థులు విదేశాల్లో చదవాలనే ఉత్సహంతో విదేశీ విద్యా సంస్థల్లో చదివేందుకుగాను తమకు వుండాల్సిన కనీస మార్కుల శాతం లేని విద్యార్థులకు సైతం ఈ ముఠా సభ్యులు విద్యార్థుల ఓరిజినల్ మార్కుల సర్టిఫికేట్ ను ఆధారంగా చేసుకోని కావల్సిన అధిక మార్కులతో కూడిన నకిలీ సర్టిఫికేట్లను తయారు చేసేవారు.
అలాగే కొన్ని విదేశాల్లో విద్యను అభ్యసించాలనుకున్న విద్యార్థులు మొదటి ప్రయత్నంలోనే ఉత్తీర్ణులైన వుండాలని విదేశీ విశ్వ విద్యాలయాలు విద్యార్థులకు నియమం పెట్టడంతో ఈ నియమాన్ని సైతం ముఠా సభ్యులు తమ అనుకూలంగా మార్చుకోని వివిధ సెమిస్టర్లలో ఫెయిల్ అయిన మొదటి ప్రయత్నంలోనే పాస్ కాని విద్యార్థులకు సైతం మొదటి ప్రయత్నంలోనే పాస్ అయినట్లుగా నకిలీ సర్టిఫికేట్లను తయారు చేసి అందజేసారు. ఈ విధంగా నకిలీ సర్టిఫికెట్లను తయారు చేసి విధ్యార్థులను విదేశాలకు పంపించేందుకుగాను అవసరమయిన పత్రాలను రూపోందించినందుకుగాను ఈ ముఠా ఒక లక్ష రూపాయల నుండి నాలుగు లక్షల రూపాయల వరకు డబ్బును వసూలు చేసేవారు. ఈ వ్యవహారానికి సంబంధించి టాస్క్ ఫోర్స్ కు సమాచారం అందడంతో టాస్క్ఫర్స్ ఇంచార్జ్ అదనపు డిసిపి వైభవ్ గైక్వాడ్ అధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు ఈ ముఠా కార్యకలపాలపై ప్రత్యేక నిఘా కోనసాగించింది. ఇందులో భాగంగా టాస్క్ ఫోర్స్ పోలీసులు నిందితులకు సంబంధించిన కన్సల్టెన్సీ సంస్థలపై దాడులు నిర్వహించడంతో ఈ నకిలీ సర్టిఫికేట్ల తయారి వ్యవహారం బయటపడింది.
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ తల్లిదండ్రులు తమ పిల్లలను నకిలీ సర్టిఫికెట్లతో విదేశాల్లో చదివించేందుకు పంపడం నేరం కావడంతో పాటు, విధ్యార్థి పేరును బ్లాక్ లిస్ట్స్లో పెట్టడం ద్వారా భవిష్యత్తులో మరెక్కడ చదివేందుకుగాను, ప్రభుత్వ ఉద్యోగాలు పొందేందుకు అర్హత కోల్పోవడం జరుగుతుందని పోలీస్ కమిషనర్ తెలియజేసారు.
ఈ నకిలీ సర్టిఫికెట్ల తయారీ ముఠా పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన అదనపుడ డిసిపి వైభవ్ గైక్వాడ్, టాస్క్ఫోర్స్ ఇన్ స్పెక్టర్లు శ్రీనివాజ్, ఎస్.ఐలు ప్రేమానందం, హెడ్ కానిస్టేబుల్ శ్యాంసుందర్, కానిస్టేబుల్లు శ్రీనివాస్, మహేందర్, సృజన్, శ్రీకాంత్, లియాఖత్ అలీ, ఏ.ఆర్ డ్రైవర్ శ్రీనివాన్లను పోలీస్ కమిషనర్ అభినందించారు.

Related posts

‘మీ భర్తను చంపడం ఎలా?’ అనే వ్యాసం రాసిన రచయిత్రి తన భర్తనే చంపేసింది!

Drukpadam

బెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్ స్కాంలో ఈడీ సోదాలు… గుట్టలు గుట్టలుగా డబ్బు… !

Drukpadam

తెల్లవారిన బతుకులు.. తెలుగు రాష్ట్రాల్లో తెల్లవారుజామున నెత్తురోడిన రోడ్లు.. 13 మంది బలి!

Drukpadam

Leave a Comment