రెండు కేసుల్లో దోషిగా తేలిన మాజీ మంత్రి శంకర్‌రావు.. తీర్పు విని స్పృహ తప్పి పడిపోయిన వైనం!

రెండు కేసుల్లో దోషిగా తేలిన మాజీ మంత్రి శంకర్‌రావు.. తీర్పు విని స్పృహ తప్పి పడిపోయిన వైనం!
-శంకర్‌రావుకు వ్యతిరేకంగా 2015లో మూడు కేసులు
-రెండింటిలో దోషిగా తేల్చిన కోర్టు
-సరైన సాక్ష్యాధారాలు లేకపోవడంతో ఓ కేసులో ఊరట

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి పి.శంకర్‌రావుకు హైదరాబాద్‌లోని నాంపల్లి ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానంలో ఎదురుదెబ్బ తగిలింది. ఆయనపై నమోదైన మూడు కేసుల్లో రెండింటిలో దోషిగా తేలారు. భూ వివాదంలో బెదిరింపులు, మహిళను దూషించిన ఆరోపణలపై 2015లో శంకర్‌రావుపై షాద్‌నగర్‌లో మూడు కేసులు నమోదయ్యాయి.

వీటిపై నిన్న విచారణ జరగ్గా సరైన సాక్ష్యాధారాలు లేకపోవడంతో ఓ కేసులో ఆయనకు ఊరట లభించింది. అయితే, భూ వివాదంలో బెదిరింపులు, మహిళను దూషించిన కేసులో మాత్రం శంకర్‌రావును కోర్టు దోషిగా తేల్చింది. మహిళను దూషించిన కేసులో రూ. 2,000, మరో కేసులో రూ. 1,500 జరిమానా విధించింది. కోర్టులోనే ఉన్న మాజీ మంత్రి తీర్పు వెలువడిన వెంటనే షాక్‌తో స్పృహ తప్పి పడిపోయారు. శంకర్ రావు గతంలో వైయస్ జగన్ పై కాంగ్రెస్ అధిష్టానం ఆడేశానం సారం కేసులు వేశారని ఆరోపణలు ఉన్నాయి. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఇప్పుడు జగన్ కేసు కూడా కోర్టులో నడుస్తుంది. ఎర్రంనాయుడు , అశోక గజపతి రాజు లు కూడా జగన్ పై కేసులు వేశారు .ఈ కేసులన్నీ రాజకీయ ప్రేరేపితమని పార్లమెంట్ లో బీజేపీ కి చెందిన ప్రతిపక్ష నాయకురాలుగా ఉన్న సుస్మాస్వరాజ్ అన్నారు . ప్రభుత్వం సిబిఐ లాంటి సంస్థలను తమ రాజకీయ ప్రత్యర్థులపై కక్ష తీర్చుకునేందుకు ఉపయోగించుకుంటున్నారని విమర్శించారు.

Leave a Reply

%d bloggers like this: