Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

యూపీ లో బీజేపీకి దెబ్బమీద దెబ్బ …కలవరపడుతున్న అధిష్టానం!

యూపీ లో బీజేపీకి దెబ్బమీద దెబ్బ …కలవరపడుతున్న అధిష్టానం!
-బీజేపీ వికెట్లు టపటపా పడుతున్నాయన్న అఖిలేశ్ యాదవ్
-ఉత్తరప్రదేశ్ లో ఆసక్తికర పరిణామాలు
-బీజేపీని వీడుతున్న ప్రజాప్రతినిధులు
-సమాజ్ వాదీ పార్టీలో చేరుతున్న వైనం
-ముగ్గురు మంత్రులు, 8 మంది ఎమ్మెల్యేలు గుడ్ బై
-తాజాగా ఇతర పార్టీల ఎమ్మెల్యేలు కూడా ఎస్పీలో చేరిక

బీజేపీ ఇప్పటివరకు తాను అనుకున్నది సాదిస్తూ వస్తున్న బీజేపీకి దేశంలోనే పెద్ద రాష్ట్రమైన యూపీలో పరిణామాలు కలవరదపెడుతున్నాయి. ఇప్పటికే ముగ్గురు మంత్రులు 8 మంది ఎమ్మెల్యేలు పలువురు కీలక నేతలు బీజేపీకి గుడ్ బై చెప్పే సమాజవాది పార్టీ లో చేరడం కీలక పరిణామంగా మారింది. వీరే కాకా మిగతా పార్టీ లనుంచి కూడా ముగ్గురు ఎమ్మెల్యేలు , ముఖ్యనేతలు ఎస్పీ లో చేరడంతో ఎస్పీ దూకుడు పెంచింది. వచ్చే నెలలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ నుంచి వెనకబడి తరగతులకు చెందిన మంత్రులు వీడటంపై ఆపార్టీ విజయావకాశాలపై ప్రభావం చెప్పే అవకాశం ఉందని రాజకీయ పండితులు భావిస్తున్నారు .

ఉత్తరప్రదేశ్ లో బీజేపీకి ఏమాత్రం మింగుడుపడని పరిణామాలు జరుగుతున్నాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు సమాజ్ వాదీ పార్టీలోకి క్యూ కడుతున్నారు. రోజూ ఎవరో ఒక మంత్రి రాజీనామా చేయడం, ఆయన వెంట ఒకరిద్దరు బీజేపీ ఎమ్మెల్యేలు సమాజ్ వాదీ గూటికి చేరడం పరిపాటిగా మారింది.

ఈ నేపథ్యంలో సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. యూపీలో బీజేపీ వికెట్లు టపటపా పడుతున్నాయని ఎద్దేవా చేశారు. క్రికెట్ ఆట ఎలా ఆడాలో ఈ సీఎంకు తెలియడంలేదని వ్యంగ్యం ప్రదర్శించారు. మూడ్రోజుల వ్యవధిలో ముగ్గురు మంత్రులు, 8 మంది ఎమ్మెల్యేలు బీజేపీకి రాజీనామా చేయడం పట్ల ఆయన పైవిధంగా స్పందించారు.

తాజాగా ఇతర పార్టీల నేతలు కూడా సమాజ్ వాదీ పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నారు. అప్నాదళ్ పార్టీ ఎమ్మెల్యే అమర్ సింగ్ చౌదరి, బీఎస్పీ శాసనసభ్యులు బలరామ్ సైనీ, నీరజ్ కుమార్ కుష్వాహా కూడా సమాజ్ వాదీ గూటికి చేరారు.

Related posts

వచ్చే ఎన్నికల్లో జగన్ సీట్ల సంఖ్య 15 నా ?51 నా ?? లోకేష్ సంచలన వ్యాఖ్యలు …!

Drukpadam

విశాఖ ఎంపీ పై పవన్ కళ్యాణ్ చిందులు …

Ram Narayana

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా మోసగించిన కేంద్రం: సీతారాం ఏచూరీ!

Drukpadam

Leave a Comment