అభ్యర్థుల జాబితాను రెడీ చేసిన పంజాబ్ కాంగ్రెస్.. రెండు స్థానాల నుంచి సీఎం చన్నీ పోటీ!

అభ్యర్థుల జాబితాను రెడీ చేసిన పంజాబ్ కాంగ్రెస్.. రెండు స్థానాల నుంచి సీఎం చన్నీ పోటీ!

  • పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి కాంగ్రెస్‌కు పోటీ
  • నేటి సీఈసీ సమావేశం తర్వాత తొలి జాబితా విడుదల!
  • ఫిబ్రవరి 14న ఒకే విడతలో ఎన్నికలు

వచ్చే నెలలో దేశంలోని ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీలన్నీ అభ్యర్థుల ఎంపికలో తలమునకలుగా ఉన్నాయి. ప్రత్యర్థులను ఢీకొట్టే బలమైన అభ్యర్థులపై దృష్టిసారిస్తున్నాయి.

ఈ క్రమంలో కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ఈసారి పోటీ తప్పదని భావిస్తున్న పంజాబ్ కాంగ్రెస్ ఇప్పటికే అభ్యర్థుల ఎంపికను పూర్తిచేసింది. మరోమారు అధికారాన్ని హస్తగతం చేసుకోవాలని గట్టి పట్టుదలగా ఉన్న కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ  అభ్యర్థులను ఖరారు చేసినట్టు తెలుస్తోంది. నేటి సీఈసీ సమావేశం తర్వాత తొలి జాబితాను విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది.

ముఖ్యమంత్రి చరణ్‌జీత్ సింగ్ చన్నీ.. చమ్‌కౌర్, అదాంపూర్ స్థానాల నుంచి ఎన్నికల బరిలోకి దిగనున్నట్టు తెలుస్తోంది. పంజాబ్, ఉత్తరాఖండ్, గోవాలలో ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 14న ఈ మూడు రాష్ట్రాలలో పోలింగ్ జరగనుంది. మణిపూర్‌లో ఫిబ్రవరి 27, మార్చి 3న రెండు విడతల్లో ఎన్నికల్లో జరగనుండగా, పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో ఏకంగా ఏడు విడతలుగా ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రంలోని 403 స్థానాలకు ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7వ తేదీ వరకు ఎన్నికలు జరుగుతాయి. మార్చి 10న ఫలితాలు వెల్లడవుతాయి.

Leave a Reply

%d bloggers like this: