అయోధ్య రామమందిరం 3డీ వీడియో విడుదల చేసిన ట్రస్టు!

అయోధ్య రామమందిరం 3డీ వీడియో విడుదల చేసిన ట్రస్టు!

  • అయోధ్యలో రామమందిర నిర్మాణం
  • 2020 ఆగస్టు 5న భూమిపూజ చేసిన ప్రధాని మోదీ
  • కొనసాగుతున్న నిర్మాణ పనులు
  • 2023 డిసెంబరు నుంచి భక్తులకు అనుమతి

ayiఅయోధ్యలో రామ జన్మభూమి ప్రదేశంలో రామ మందిరం నిర్మాణం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో రామ మందిర నిర్మాణం వీడియోను శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు విడుదల చేసింది. ఆలయ నిర్మాణ పనులు జరుగుతున్న తీరు, ఆలయంలోని వివిధ ప్రదేశాలు, ఆలయానికి దారితీసే రోడ్డు మార్గం తదితర అంశాలను ఈ వీడియోలో పొందుపరిచారు.

ఈ వీడియో నిడివి ఐదు నిమిషాలు. ఈ వీడియోను 3డీ యానిమేషన్ విధానంలో రూపొందించారు. 2020 ఆగస్టు 5న ప్రధాని నరేంద్ర మోదీ రామ మందిర నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 2023 డిసెంబరు నుంచి భక్తుల సందర్శనకు అనుమతి ఇవ్వనున్నారు.

Leave a Reply

%d bloggers like this: