రోజుకు రెండు చెంచాల నువ్వులు.. కొలెస్ట్రాల్ పై బ్రహ్మాస్త్రం!

రోజుకు రెండు చెంచాల నువ్వులు.. కొలెస్ట్రాల్ పై బ్రహ్మాస్త్రం!

  • రెండు నెలల పాటు తీసుకుంటే మంచి ఫలితాలు
  • ఎల్డీఎల్ కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ తగ్గుముఖం
  • గుర్తించిన పరిశోధకులు
  • న్యూట్రిషన్ రీసెర్చ్ జర్నల్ ప్రచురణ

ఆయుర్వేదంలో నువ్వులకు ఎంతో ప్రాధాన్యం ఉంది. శీతాకాలంలో  నువ్వులు, బెల్లం కలిపి చేసిన లడ్డూలను వెనుకటికి పెద్దలు పిల్లలకు తినిపిస్తుండేవారు. శరీరం లోపల నువ్వులు ఉష్ణోగ్రతను పెంచుతాయి. దీంతో శీతల ప్రభావాన్ని తట్టుకోవచ్చు. పైగా ఎదిగే పిల్లలకు క్యాల్షియం అవసరం ఎంతో ఉంటుంది. ఇలా చూసుకున్నా నువ్వులు చేసే మేలు చాలానే ఉంది. పిల్లలకే కాదండి.. నువ్వులతో అన్ని వయసుల వారికి ఎన్నో ప్రయోజనాలున్నాయి.

నిత్యం 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల పరిమాణంలో నువ్వులు తీసుకోవడం వల్ల రక్తంలో చెడు కొవ్వులు తగ్గుతాయని న్యూట్రిషన్ రీసెర్చ్ అనే జర్నల్ లో ప్రచురితమైన తాజా అధ్యయన వివరాలు తెలియజేస్తున్నాయి. ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ 8-16 శాతం, టోటల్ కొలెస్ట్రాల్ 8 శాతం మేర రెండు నెలల్లో తగ్గుతోందని పరిశోధకులు గుర్తించారు. దీనివల్ల గుండెపోటు ముప్పును తగ్గించుకోవచ్చని చెబుతున్నారు.

చెడు కొలెస్ట్రాల్, ట్రై గ్లిజరైడ్స్ నియంత్రణకు నువ్వులు మంచి ఫలితాలను ఇస్తున్నట్టు ఈ అధ్యయన పరిశోధకులు తెలుసుకున్నారు. చిన్న ప్రేగు కొలెస్ట్రాల్ ను గ్రహించకుండా నువ్వుల్లోని సిసామిన్ అడ్డుకుంటుందని చెబుతున్నారు. హెచ్ ఎంజీ సీవోఏ రెడుక్టేస్ అనే ఎంజైమ్ యాక్టివిటీని సిసామిన్ తగ్గిస్తుంది. శరీరం కొలెస్టరాల్ ను గ్రహించడానికి కారణమయ్యే ఎంజైమ్ ఇది.

నువ్వుల్లోని ఆల్ఫాలినోలిక్ యాసిడ్ ట్రైగ్లిజరైడ్స్ ను తగ్గిస్తోంది. చివరిగా నువ్వుల్లో ఉండే ఫైబర్ సైతం రక్తంలోని ఎల్డీఎల్ కొలెస్టరాల్ స్థాయులను తగ్గిస్తున్నట్టు పరిశోధకులు గుర్తించారు. నువ్వుల్లో ప్రొటీన్, క్యాల్షియం, మాంగనీస్, విటమిన్ ఇ, అన్ శాచురేటెడ్ ఫ్యాట్స్, ఫైబర్ ఉంటాయి.

Leave a Reply

%d bloggers like this: