టికెట్ ఆశించి భంగపడిన బీఎస్పీ నేత.. బోరున ఏడ్చిన వైనం !

టికెట్ ఆశించి భంగపడిన బీఎస్పీ నేత.. బోరున ఏడ్చిన వైనం !

  • చార్తావల్ స్థానం నుంచి టికెట్ ఆశించిన బీఎస్‌పీ నేత
  • అది దక్కకపోవడంతో ఆవేదన
  • టికెట్ ఇప్పిస్తాని రూ. 50 లక్షలు అడిగారని ఓ నేతపై ఫిర్యాదు
  • న్యాయం జరగకుంటే ఆత్మహత్యే మార్గమంటూ ఏడుపు

టికెట్ ఆశించి అది దక్కకపోవడంతో బోరున విలపించాడో నేత. ఉత్తరప్రదేశ్‌లో జరిగిందీ ఘటన. బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్‌పీ)కి చెందిన అర్షద్ రాణా ముజఫర్‌నగర్‌లోని చార్తావల్ స్థానం నుంచి టికెట్ ఆశించారు.  అయితే, బీఎస్‌పీ చీఫ్ మాయావతి ఆ స్థానం నుంచి వేరే అభ్యర్థిని బరిలోకి దించారు. విషయం తెలిసిన రాణా సామాజిక మాధ్యమాల ద్వారా తన ఆవేదనను వ్యక్తం చేశారు. అనంతరం పోలీస్ స్టేషన్‌కు వెళ్లి బోరున విలపించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.

ఇక, పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న రాణా.. చార్తావల్ టికెట్ ఇప్పిస్తానని పార్టీ నేత ఒకరు రెండేళ్ల క్రితం రూ. 50 లక్షలు డిమాండ్ చేశారని, ఇప్పటికే రూ. 4.50 లక్షలు ఇచ్చానని రాణా పేర్కొన్నారు. తనకు న్యాయం చేయకుండా ఆత్మహత్య తప్ప వేరే మార్గం లేదంటూ బోరున విలపించారు.

Leave a Reply

%d bloggers like this: