Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

టీడీపీ …జనసేన పొత్తు పొడుస్తుందా ? బీజేపీకి పవన్ దూరం కానున్నారా ??

టీడీపీ …జనసేన పొత్తు పొడుస్తుందా ? బీజేపీకి పవన్ దూరం కానున్నారా ??
-పవన్ తో పొత్తు లేకుంటే టీడీపీకి అధికారం కష్టమే-టీడీపీ నేతల మనోభావం
-ప్రస్తుతానికి టీడీపీ కి దూరంగా పవన్
-పవన్ కు గాలం వేస్తున్న చంద్రబాబు
పవన్ చిక్కుతారా …

ఏపీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఈసారి ఎన్నికల్లో వైసీపీ ని ఓడించి తిరిగి అధికారంలోకి రావాలని టీడీపీ ఉవ్విళ్ళు ఊరుతుంది .అందుకు గాను వారికున్న ఏకైక మార్గం పవన్ కళ్యాణ్ …ఆయన ప్రస్తుతం బీజేపీ తో జట్టుకట్టారు . కానీ ఎన్నికల నాటికీ తమవైపు కు తిప్పుకోవాలని చంద్రబాబు గట్టి ప్రయత్నం చేస్తున్నారు. మరి బాబు గాలానికి పవన్ చిక్కుతారా ? లేదా ? అనేది ఆశక్తిగా మారింది.టీడీపీ నాయకులూ మాత్రం పవన్ లేకపోతె తిరిగి టీడీపీ అధికారంలోకి రావడం పై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు .

ఏపీలో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. ఓవైపు జనసేనతో పొత్తు కోసం టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రంగా ప్రయత్నిస్తుండగా.. పవన్ కళ్యాణ్ మాత్రం ప్రస్తుతానికి దూరం పెడుతున్నారు. బీజేపీతో ఉన్న పొత్తు కారణంగా ప్రస్తుతానికి టీడీపికి దూరంగా ఉంటున్నా భవిష్యత్తులో మాత్రం చంద్రబాబుకు దగ్గర కారన్న గ్యారంటీ లేదు. దీంతో టీడీపీ-జనసేన పొత్తుపై ఎవరెన్ని వ్యాఖ్యలు చేస్తున్నా క్షేత్రస్ధాయిలో మాత్రం పొత్తు ఖాయమన్న ప్రచారమే జరుగుతోంది.

ఏపీలో చంద్రబాబు రాజకీయాలకు పదునుపెడుతున్నారు. ముఖ్యంగా రెండున్నరేళ్ల పదవీకాలం పూర్తిచేసుకున్న వైసీపీ సర్కార్ పై క్షేత్రస్దాయిలో వ్యతిరేకత పెరుగుతున్న వేళ దాన్ని సొమ్ము చేసుకునేందుకు తాము రంగంలోకి దిగాల్సిందేనని భావిస్తున్న చంద్రబాబు.. తమతో పాటు మిగతా విపక్షాలను కూడా కలుపుకుపోయేందుకు పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగా ముందుగా బీజేపీతో పొత్తు కోసం ప్రయత్నాలు చేసిన చంద్రబాబు.. ఇప్పుడు జనసేన కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. పవన్ తో పొత్తు కోసం తాను ప్రయత్నిస్తున్నట్లు ఆయన బహిరంగంగానే చెప్తున్నారు.

ప్రస్తుతం బీజేపీతో పొత్తులో ఉన్న పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన.. ఇప్పటికిప్పుడు ఆ పార్టీని వీడి టీడీపీతో కలిసేందుకు సిద్ధంగా ఉన్నట్లు కనిపించడం లేదు. క్షేత్రస్ధాయిలో స్ధానికంగా పొత్తులకు ఓకే అయినా రాష్ట్రస్దాయిలో పొత్తు పెట్టుకునేందుకు మాత్రం సంసిద్ధంగా లేదు. దీనికి చాలా కారణాలున్నాయి.

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని కాదని ఇప్పటికిప్పుడు టీడీపీతో పొత్తు పెట్టుకుంటే బీజేపీ ఇద్దరినీ కలిపి టార్గెట్ చేసినా ఆశ్చర్యం లేదనేది జనసేన వర్గాల మాట. అందుకే ప్రస్తుతానికి బీజేపీతో పొత్తు కొనసాగించాలని భావిస్తున్నారు.

ప్రస్తుతం బీజేపీతో పొత్తులో ఉన్న పవన్ కళ్యాణ్.. చంద్రబాబు ఇస్తున్న ఆఫర్ ను స్వీకరించే పరిస్దితుల్లో లేరు. అయితే భవిష్యత్తులో బీజేపీతో టీడీపీ పొత్తు ఖరారైతే మాత్రం లెక్కలు మారే అవకాశం ఉన్నందున పవన్ ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. బీజేపీ-టీడీపీ పొత్తు అవకాశాలు లేవని ఒకసారి తేలిపోతే మాత్రం తాను టీడీపీతో కలిసి ముందుకు సాగే విషయంలో తుది నిర్ణయం తీసుకోవాలని పవన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అలా కాకుండా ఇప్పిటికిప్పుడు బీజేపీని వీడి టీడీపీతో జత కడితే కేంద్రం తమ ఇద్దరినీ కలిపి టార్గెట్ చేయొచ్చనే భయాలు ఉన్నాయి. దీంతో ఇప్పట్లో పొత్తులపై జనసేనాని ఏమీ తేల్చకపోవచ్చని చెప్తున్నారు.

ప్రస్తుతానికి తమతో పొత్తు కోసం జనసేన నో అంటున్నా భవిష్యత్తులో కలిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్న చంద్రబాబు అప్పటివరకూ క్షేత్రస్దాయిలో ఆ పార్టీతో కలిసి పనిచేసేందుకు తమ పార్టీ శ్రేణుల్ని ప్రోత్సహిస్తున్నారు. దీంతో చాలా చోట్ల ఇప్పుడు చంద్రబాబు-పవన్ ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి. అలాగే వీటిపై అభ్యంతరాలు కూడా వ్యక్తం కావడం లేదు. త్వరలో ఈ రెండు పార్టీలు కలిసి ముందుకు సాగవచ్చనే అంచనాలు క్షేత్రస్ధాయిలోనూ ఉన్నాయి. దీంతో రాబోయే రోజుల్లో బీజేపీ కాకపోయినా జనసేనతో జట్టు కట్టగలిగితే వైసీపీని దీటుగా ఎదుర్కోవచ్చనే అంచనాలో చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తోంది.

Related posts

నోటికొచ్చినట్టు వాగితే మూతి పగలగొడతా: టీడీపీ నేతపై రోజా ఆగ్రహం!

Drukpadam

ఎన్సీపీ అధినేతగా శరద్ పవార్ మరోసారి ఎన్నిక!

Drukpadam

పీసీసీ చీఫ్ రేవంత్ పై టీఆర్ యస్ నేతల భగ్గుభగ్గు…

Drukpadam

Leave a Comment