Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

అబుదాభి ఎయిర్ పోర్టుపై ఉగ్రదాడి!

అబుదాభి ఎయిర్ పోర్టుపై ఉగ్రదాడి!

  • డ్రోన్ ల ద్వారా దాడికి పాల్పడిన వైనం
  • ఎయిర్ పోర్టులోని మూడు ఆయిల్ ట్యాంకర్లు ధ్వంసం
  • దాడికి పాల్పడింది తామేనని ప్రకటించుకున్న హౌతీ ఉగ్రవాదులు
అరబ్ ఎమిరేట్స్ రాజధాని అబుదాబి లో ఉగ్రసంఘటన కలకలం రేపింది. యూ ఏ ఈ లో శాంతిభద్రతలపై అక్కడ ప్రభుత్వాలు చాల జాగ్రత్తలు తీసుకుంటాయని పేరుంది. అమెరికా బ్రిటన్ లకు వెళ్లే విమానాలు ఎక్కవగా అబుదాబి నుంచే వెళ్లడం రావడం జరుగుతుంది. హైతీ ఉగ్రమూకలు ఈ దాడికి తామే భాద్యులమని ప్రకటించింది. ఈ దాడి ఘటనతో యూ ఏ ఈ అప్రమత్తమైంది. ఎయిర్ పోర్టులో ప్రయాణికులకు భద్రతా కల్పించారు. తిరిగి విమానప్రయాణాలను సైతం కొనసాగించారు. ఎయిర్ పోర్ట్ కు వచ్చే దారులకు కట్టుదిట్టమైన భద్రతా కల్పించారు.

యూఏఈ రాజధాని అబుదాభి ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుపై ఉగ్రదాడి జరిగింది. డ్రోన్ సహాయంతో టెర్రరిస్టులు దాడికి పాల్పడ్డారు. ఎయిర్ పోర్టులోని ఇంధన వాహక ట్యాంకర్లను లక్ష్యంగా చేసుకుని దాడి చేశారు. ఈ దాడిలో మూడు ఆయిల్ ట్యాంకర్లు పేలిపోయాయని అధికారులు తెలిపారు.

మరోపక్క, ఈ డ్రోన్ దాడులు తమ పనేనని హౌతీ ఉగ్రవాదులు ప్రకటించుకున్నారు. హౌతీ ఉగ్రవాదులకు ఇరాన్ మద్దతు ఉన్న సంగతి తెలిసిందే. 2019 సెప్టెంబర్ లో సౌదీ అరేబియాలోని రెండు కీలక చమురు స్థావరాలపై హౌతీ ఉగ్రవాదులు దాడి చేశారు. దీంతో గల్ఫ్ లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

Related posts

ఎట్టకేలకు విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్!

Drukpadam

స్మిత సబర్వాల్ వంటి వ్యక్తికే భద్రతలేదు …కేసీఆర్ పాలనలో మోసం దగా …రేవంత్ రెడ్డి …

Drukpadam

కేసుల పరిష్కరంలో మధ్య వర్తిత్వమే మేలు ..రిటైర్ సిజెఐ జస్టిస్ రమణ…!

Drukpadam

Leave a Comment