భార్య పట్ల మృగంలా ప్రవర్తించిన భర్త.. స్నేహితులతో కలిసి అత్యాచారం..

భార్య పట్ల మృగంలా ప్రవర్తించిన భర్త.. స్నేహితులతో కలిసి అత్యాచారం.. ఆపై చిత్రహింసలు!

  • మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో దారుణం
  • స్నేహితులతో కలిసి భార్యపై అసహజరీతిలో అత్యాచారం
  • ఆపై రహస్య భాగాల్లో సిగరెట్లతో కాల్చిన వైనం
  • నిందితులు ఐదుగురుని అరెస్ట్ చేసిన పోలీసులు

కట్టుకున్న భార్యతోనే మృగంలా ప్రవర్తించాడో భర్త. స్నేహితులతో కలిసి అత్యాచారానికి పాల్పడడమే కాకుండా ఆమెను చిత్రహింసలకు గురిచేశాడు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో బాధితురాలి భర్తతోపాటు మరో నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

చత్తీస్‌గఢ్‌కు చెందిన బాధితురాలు మ్యాట్రిమోనీ సైట్ ద్వారా ఇండోర్ వ్యక్తిని పెళ్లి చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. భర్త, అతడి స్నేహితుల చిత్ర హింసల నుంచి తప్పించుకున్న బాధితురాలు పోలీస్ స్టేషన్‌కు చేరుకోవడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

ఇండోర్‌లోని పిప్రా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ఫాంహౌస్‌లో నవంబరు 2019, అక్టోబరు 2021లలో భర్త, అతడి స్నేహితులు తనపై అత్యాచారానికి పాల్పడినట్టు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాధితురాలు పేర్కొంది. అసహజ రీతిలో తనపై అత్యాచారం చేశారని, ఆపై సిగరెట్లతో రహస్య భాగాల్లో కాల్చి చిత్రహింసలు పెట్టారని ఆరోపించింది.

వారిని ప్రతిఘటించేందుకు ప్రయత్నించిన తనను చంపేస్తామని బెదిరించారని పేర్కొంది. వారి నుంచి తప్పించుకుని చత్తీస్‌గఢ్‌లోని తన తల్లి గారింటికి చేరుకున్నప్పటికీ నిందితుల్లో ఒకడు తనకు ప్రాణహాని కలిగించే ఉద్దేశంతో అనుసరిస్తుండేవాడని పేర్కొంది. ఆమె ఫిర్యాదుపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసుకున్న పోలీసులు మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్‌లోని పలు ప్రాంతాల్లో నిందితులు ఐదుగురినీ అరెస్ట్ చేశారు. కేసును దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Leave a Reply

%d bloggers like this: